ప్రియాంక, నిక్ వెడ్డింగ్ రిసెప్షన్: హాజరు కానున్న ప్రపంచస్థాయి రాజకీయ నేతలు..పెళ్లి ఫోటోలు!
అందాల తార ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైనా సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. నిక్ జోనస్, ప్రియాంక చోప్రా చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. జోధ్ పూర్ లో ఉమైద్ భవన్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా నేడు ఢిల్లీ లోని తాజ్ మహల్ ప్యాలెస్ లో నిక్, ప్రియాంక వెడ్డింగ్ రిసెప్షన్ భారీ స్థాయిలో జరుగనుంది.

ప్రపంచ స్థాయిలో
ప్రపంచ స్థాయి రాజకీయ నేతలు కూడా ప్రియాంక, నిక్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరు కానున్నారు. అతిథులుగా హాజరయ్యే వారి జాబితాలో చాలా మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఢిల్లీ లోని తాజ్ మహల్ హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి.

అందమైన ఫోటోలు
రిసెప్షన్ కు కొద్ది సమయం ఉండగా ప్రియాంక చోప్రా తన వివాహ ఫోటోలని షేర్ చేసింది. హిందూ, క్రిస్టియన్ రెండు సాంప్రదాయాలలో జరిగిన పెళ్లి ఫోటోలని అభిమానులతో పంచుకుంది.తుదివరకు సాగే మా ప్రయాణం మొదలయింది అని పేర్కొంది.

నిక్, ప్రియాంక కుటుంబ సభ్యులు
నిక్, ప్రియాంక చోప్రాతో పాటు ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ రాత్రికి జరిగే రిసెప్షన్ కు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

వేదిక సిద్ధం
ప్రియాంక షేర్ చేసిన దృశ్యాలు చూస్తే వివాహం ఎంత ఘనంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. క్రిస్టియన్ సాంప్రదాయంలో వైట్ డ్రెస్ లో మెరిసిన ప్రియాంక ఏంజెల్ లా కనిపిస్తోంది. రిసెప్షన్ కోసం తాజ్ మహల్ హోటల్ ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆకర్షణీయమైన పుష్పాలతో తాజ్ మహల్ హోటల్ ని సిద్ధం చేశారు.


Click it and Unblock the Notifications











