బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను.. ప్రియాంక చోప్రా ఎమోషనల్..

Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ అమ్మడు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి.. తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అనతికాలంలోనే బాలీవుడ్ లో డమ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీ మారింది. అవకాశం దొరికినప్పుడల్లా బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.ఇంతకీ ఏం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే.. లాస్ ఏంజిల్స్‌లోని కార్చిచ్చు వల్ల పలు ప్రాంతాల్లో వినాశం జరిగిన విషయం తెలిసిందే. మంటల వల్ల నగరంలో విధ్వంసం సృష్టించబడింది. ఈ అగ్నిప్రమాదం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. 25 మంది మరణించగా.. 40,600 ఎకరాలకు పైగా విస్తీర్ణం దెబ్బతింది. చాలా మంది ఇళ్ళు కాలి బూడిదయ్యాయి. ఈ దారుణ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆందోళనను వ్యక్తం చేశారు. తాజాగా ఈ ప్రమాదంపై బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా స్పందించింది.

Priyanka Chopra On Los Angeles Fire Says Her Heart Is Heavy Many Friends Lost Everything

ప్రియాంకకు లాస్ ఏంజిల్స్‌లో ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. కాలిఫోర్నియాలో వినాశకరమైన కార్చిచ్చులు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి. దీని కారణంగా.. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. లెక్కలేనన్ని ఇళ్ళు బూడిదయ్యాయి. లాస్ ఏంజిల్స్‌లో తన కుటుంబంతో ఉన్న ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తన వేదనను వ్యక్తం చేసింది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ఇదంతా చూసిన తర్వాత తన గుండె చాలా బరువెక్కింది. విధ్వంసం సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ.. అగ్నిమాపక సిబ్బందికి తన కృతజ్ఞతలు తెలిపారు ప్రియాంక.

ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. 'లాస్ ఏంజిల్స్‌ ను చూసి నా హృదయం బరువెక్కింది. నా కుటుంబ భద్రతకు నేను చాలా కృతజ్ఞుడను. కానీ, నా స్నేహితులు, సహోద్యోగులు, తోటి ఏంజెలెనోలు చాలా మంది చాలా కోల్పోయారు.ఈ మంటలు లెక్కలేనన్ని కుటుంబాలను రోడ్డున పడేశాయి. వారి జీవితాలు నాశనం అయ్యాయి. పునరుద్ధరణ, ఉపశమనం కోసం విపరీతమైన అవసరాన్ని మిగిల్చాయి. అగ్నిమాపక సిబ్బంది, సహాయకులు ప్రతిదీ పణంగా పెడుతున్నారు. మీరే నిజమైన హీరోలు' అంటూ ప్రియాంక ఎమోషనల్ అయ్యింది.

Priyanka Chopra On Los Angeles Fire Says Her Heart Is Heavy Many Friends Lost Everything

ప్రియాంక ప్రజలకు సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. ప్రియాంక తన ఫాలోయర్స్ ను కూడా సహాయక చర్యలకు విరాళాలు ఇవ్వాలని అభ్యర్థించింది. దయచేసి అన్నీ కోల్పోయిన వారికి దానం చేయండి. ప్రతి సహకారం ఎంతదైనా వారికి సహాయపడుతుంది 'అని హీరోయిన్ విజ్ఞప్తి చేసింది. "అని ప్రియాంక రాసుకోచ్చింది.

లాస్ ఏంజిల్స్ , దాని పరిసర ప్రాంతాలలో కారుచిచ్చు చాలా విధ్వంసం సృష్టించింది. అగ్నిప్రమాదం కారణంగా వేలాది కుటుంబాలు ప్రభావితమయ్యాయి. అదే సమయంలో అనేక హాలీవుడ్ ప్రముఖుల కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. అన్నా ఫారిస్, యూజీన్ లెవీ, మాండీ మూర్, పారిస్ హిల్టన్, ఆడమ్ బ్రాడీ, లైటన్ మీస్టర్ వంటి హాలీవుడ్ స్టార్లు కూడా ఈ కారుచిచ్చు వల్ల నష్టాలను చవిచూశారు. బ్రాడీ , మీస్టర్ ల $6.5 మిలియన్లు (INR 56,16,95,317.30) విలువైన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బెన్ అఫ్లెక్, టామ్ హాంక్స్, ఆడమ్ శాండ్లర్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి ఇతర నటులు కూడా ఎఫెక్ట్ అయ్యారు. వారు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు.

More from Filmibeat

Read more about: priyanka chopra los angeles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X