నలుగురిలో పరువు పోయేది.. తృటిలో ఎస్కేప్ అయిన ప్రియాంక చోప్రా (వీడియో)
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఇటీవల అమెరికాలో అనుకోని అనుభవం ఎదురైంది. నలుగురులో నవ్వులపాలయ్యే పరిస్థితి నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. భర్త నిక్ జోనస్ వెంటనే స్పందించి ఉండకపోతే పరువు పోయేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో చూస్తే స్పష్టమవుతోంది.
ప్రియాంక తను నటించిన 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' అనే అమెరికన్ మూవీ ప్రీమియర్స్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో హాజరయ్యారు. ఇక్కడ కారు దిగి నడుచుకుంటూ వెళుతుండగా పొడవాటి ఆమె గౌను హై హీల్స్‌లో ఇరుక్కుని కిందపడబోయారు.
వెంటనే రియాక్ట్ అయిన నిక్ జోనస్
ప్రియాంక పక్కనే ఉన్న భర్త నిక్ జోనస్.. వెంటనే రియాక్ట్ అయ్యారు. కింద పడకుండా పట్టుకున్నారు. నిక్ సహాయంతో ఆమె జాగ్రత్తగా థియేటర్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు.

వైరల్ అవుతున్న వీడియో
అప్పటికే అక్కడ ఉన్న జనాలు.. ప్రియాంక ఎదుర్కొన్న ఈ ఇబ్బందికర పరిస్థితిని తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. ఇది ఇపుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ప్రియాంక ఏ మాత్రం అసహనానికి గురి కాకుండా చిరునవ్వుతో లోనికి వెళ్లారు.

ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్
‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' సినిమా వివరాల్లోకి వెళితే.. ఇదొక రొమాంటిక్ సెటైరికల్ ఫాంటసీ ఫిల్మ్. రెబెల్ విల్సన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక ఇందులో ఇసబెల్లా అనే ఇండియన్ యోగా అంబాసిడర్ పాత్రలో నటించింది.

హాలీవుడ్ సినిమాలే ఎక్కువగా
ప్రియాంక చోప్రా ఇప్పుడు ఎక్కువగా హాలివుడ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఆమె నటించిన చివరి బాలీవుడ్ చిత్రం ‘జై గంగాజల్' 2016లో విడుదలైంది. ఆ మూవీ తర్వాత ప్రియాంక నటించిన మరో హిందీ చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్' 2019లో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











