షాకింగ్: కారులోనే ఆ పని చేసిన నిక్ జోనస్.. కోపంతో బయటకు తోసేసిన ప్రియాంక చోప్రా

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో సుదీర్ఘ కాలంగా ఇండియన్ సినిమాపై తన ప్రభావాన్ని చూపిస్తోంది హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో నటించిన ఈ అమ్మడు.. హాలీవుడ్ చిత్రాల్లో సైతం కనిపించింది. ఇక, కొన్నేళ్ల క్రితం అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె రెచ్చిపోతోంది. పబ్లిక్‌లోనే రొమాన్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వీళ్లిద్దరూ కారులోనే గొడవకు దిగినట్లు ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. అంతేకాదు, భర్త చేసిన పనికి అతడికి బయటకు తోసేసిందట ఈ బ్యూటీ. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
మిస్ వరల్డ్ నుంచి హాలీవుడ్ వరకు

మిస్ వరల్డ్ నుంచి హాలీవుడ్ వరకు

2000 సంవత్సరంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది ప్రియాంక చోప్రా. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా ఇండియన్ ఫిల్మ్స్‌లో నటిస్తూ తన హవాను చూపిస్తోందీ బాలీవుడ్ బ్యూటీ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆమె.. కొద్ది రోజుల క్రితం హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది.

నిక్ జోనస్‌తో లవ్.. పెళ్లి చేసుకుంది

నిక్ జోనస్‌తో లవ్.. పెళ్లి చేసుకుంది

హాలీవుడ్‌లోకి ప్రవేశించిన సమయంలోనే అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా ప్రేమలో పడింది. తనకంటే చిన్న వాడే అయినా అతడితో చాలా కాలం పాటు రహస్యంగా డేటింగ్ చేసింది. ఈ వ్యవహారం బయటకు వచ్చిన కొద్ది రోజులకే నిక్‌ను వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఎంతో మంది సెలెబ్రిటీలు హాజరయ్యారు.

కల్చర్ మార్చుకుని విమర్శలపాలు

కల్చర్ మార్చుకుని విమర్శలపాలు


హాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రియాంక చోప్రా వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. విచిత్రమైన డ్రెస్‌లు వేసుకోవడంతో పాటు వీకెండ్ పార్టీలు, డ్రింకింగ్ పార్టీలు వంటి చేస్తూ కనిపించింది. అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడా అలవాటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో వైరల్‌గా మారాయి. దీంతో ప్రియాంక చోప్రా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది.

పబ్లిక్‌లో రొమాన్స్.. అస్సలు తగ్గట్లే

పబ్లిక్‌లో రొమాన్స్.. అస్సలు తగ్గట్లే


రహస్యంగా డేటింగ్ చేస్తున్న సమయంలో నిక్ జోనస్.. ప్రియాంక చోప్రా పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్ చేయడం ద్వారా మీడియా కంట పడ్డారు. అప్పుడే వీళ్ల బంధం బయటకు వచ్చింది. ఇక, వివాహం తర్వాత వీళ్లిద్దరూ మరింతగా రెచ్చిపోతున్నారు. తరచూ ముద్దులు పెట్టుకోవడం, రొమాంటిక్‌గా ఫోజులివ్వడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అయ్యారు.

కారులోనే ఆ పని చేసిన నిక్ జోనస్

కారులోనే ఆ పని చేసిన నిక్ జోనస్


ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘టెక్ట్స్ ఫర్ యూ' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం అమ్మడు భర్తతో కలిసి లండన్‌కు వెళ్లింది. కొద్ది రోజులుగా వీళ్లిద్దరూ అక్కడ హల్‌చల్ చేస్తున్నారు. వీకెండ్ పార్టీలు, హాలిడే ట్రిప్పులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిక్ కారులో ఓ పని చేయడంతో వీళ్లిద్దరి మధ్య ఊహించని సంఘటన జరిగినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

బయటకు తోసేసిన ప్రియాంక చోప్రా

బయటకు తోసేసిన ప్రియాంక చోప్రా


లండన్ వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న సమయంలో నిక్ జోనస్.. ఓ విషయం గురించి ప్రియాంక చోప్రాతో గొడవకు దిగాడట. దీంతో అతడిపై సీరియస్ అయిన ఆమె... కారులో నుంచి అతడిని బయటకు తోసిసిందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఘటన తర్వాత ఇద్దరూ వేరు వేరు కార్లలో హోటల్‌కు వెళ్లిపోయారని బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X