10 క్లాస్‌లోనే బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ప్రియాంక చోప్రా
బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లో రాణిస్తున్న ప్రియాంక చోప్రా తన ఆత్మకథకు అన్‌ఫినిష్‌డ్ అనే టైటిల్‌లో ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో తన కెరీర్‌లో వివాదాలు, వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ పుస్తకంలో తాను పదో తరగతి చదువుతున్నప్పుడు ఓ బాయ్‌ఫ్రెండ్‌తో సాగించిన వ్యవహారం గురించి ఏం చెప్పారంటే...

బాలీవుడ్‌కు ముఖం చాటేసిన బ్యూటీ
ప్రియాంక చోప్రా లైఫ్ గురించి ప్రస్తావిస్తే నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకొన్న తర్వాత బాలీవుడ్‌కు ముఖం చాటేశారు. అమెరికాలోనే వెబ్ సిరీస్‌తోపాటు కొన్ని షోలలో నటిస్తున్నారు. అంతేకాకుండా గ్లోబల్ ఐకాన్ ఇమేజ్‌తో పలు కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్‌ఫినిష్‌డ్ మార్కెట్‌లోకి రాగా విపరీతమైన క్రేజ్ లభిస్తున్నది.

10వ క్లాస్‌లో ప్రియుడితో
అన్‌ఫినిష్‌డ్ పుస్తకంలో తన ప్రేమ వ్యవహారాలను వెల్లడిస్తూ... తాను 10వ క్లాస్ చదువుతున్నప్పుడే బాబ్ అనే క్లాస్‌మేట్‌తో చనువుగా ఉండేదానిని. ఆ సమయంలో జరిగిన ఓ చిలిపి సంఘటన జరిగింది. నేను, నా బాయ్‌ఫ్రెండ్ తో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ రొమాన్స్ చేస్తున్నాం. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుండగా మా అంటీ ఇంట్లోకి వస్తూ కనిపించింది అని ప్రియాంక చోప్రా పేర్కొన్నది.

ఆంటీకి చిక్కిన ప్రియాంక చోప్రా
మా ఇంట్లోకి ఆంటీ వస్తుంటే మాకు ఏమీ తోచలేదు. వెంటనే బాబ్‌ను నా రూమ్‌లోకి పంపించి.. స్టోర్ బాక్స్‌లో పెట్టాను. ఇంట్లోకి వచ్చిన మా ఆంటీ కిరణ్ అనుమానంగా నా గదిని చూడటం, ఇళ్లంతా కలియ తిరగడం మొదలుపెట్టింది. మా అంటికి అనుమానం రాకుండా నేను బయోలజీ పుస్తకం తీసుకొని చదువుతున్నట్టు నటించడం మొదలు పెట్టాను అని తన పుస్తకంలో తెలిపారు.

ప్రియుడితో పట్టుబడ్డ ప్రియాంక
నాపై అనుమానం వచ్చిన ఆంటీ బాబ్ ఉన్న బాక్స్‌ను తెరువమని చెప్పారు. దాంతో నేను ఒక్కసారిగా కంగుతిన్నాను. బలవంతంగా నాతో బాక్స్ మూత తెరిపించగానే బాబ్ కనిపించాడు. దాంతో మా ఆంటికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాము అంటూ తన జీవితంలో జరిగిన ఓ చిలిపి సంఘటనను పాఠకులతో పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











