పెళ్లికి ముందే ఎంజాయ్.. దానికోసమే కలిసే వాళ్లం: సిగ్గు విడిచి పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన ప్రియాంక

ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాలో తన హవాను చూపిస్తోంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. హిందీలోనే కాకుండా దాదాపు దేశంలోని చాలా భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. హాలీవుడ్‌లో సైతం నటించి మెప్పించింది. తద్వారా యూనివర్శల్ స్టార్ అయిపోయింది. ఈ క్రమంలోనే పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకుంది ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉండే ప్రియాంక.. తాజా ఇంటర్వ్యూలో పెళ్లికి ముందు జరిగిన విషయాన్ని లీక్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

అప్పుడే ప్రపంచాన్ని గెలిచింది.. ఇప్పుడిలా

అప్పుడే ప్రపంచాన్ని గెలిచింది.. ఇప్పుడిలా

చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడగు పెట్టింది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే 2000 సంవత్సరంలో జరిగిన అందాల పోటీల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత హిందీ చిత్రాల ద్వారా హీరోయిన్‌గా మారిన ఆమె.. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా ఇండియన్ ఫిల్మ్స్‌లో నటిస్తూ తన హవాను చూపిస్తోంది. దీంతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది కూడా.

అక్కడికెళ్లింది.. డేటింగ్ చేసింది.. పెళ్లాడింది

అక్కడికెళ్లింది.. డేటింగ్ చేసింది.. పెళ్లాడింది

భారతీయ చిత్రాల్లో నటిస్తూ చాలా కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది ప్రియాంక. అదే సమయంలో హాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది. ఆ సమయంలోనే అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా ప్రేమలో పడింది. అతడి కంటే వయసులో పెద్దదే అయినా రహస్యంగా డేటింగ్ చేసింది. ఆ తర్వాత అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో నిక్‌ను వివాహమాడింది.

పెళ్లి తర్వాత మారిన ప్రియాంక.. విమర్శలు

పెళ్లి తర్వాత మారిన ప్రియాంక.. విమర్శలు

హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రియాంక చోప్రా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనికి కారణం ఆమె వ్యవహార శైలే. అందాలు కనువిందు చేసేలా డ్రెస్‌లు వేసుకోవడంతో పాటు వీకెండ్ పార్టీలు, డ్రింకింగ్ పార్టీలు వంటి చేస్తూ కనిపించింది. అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడా అలవాటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో వైరల్‌గా మారడంతో విమర్శలు వచ్చాయి.

పబ్లిక్ ప్లేస్‌లోనే రొమాన్స్... హాట్ టాపిక్‌గా

పబ్లిక్ ప్లేస్‌లోనే రొమాన్స్... హాట్ టాపిక్‌గా

నిక్ జోనస్.. ప్రియాంక చోప్రా ప్రేమించుకున్న సమయంలో చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కానీ, ఓ సారి పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్ చేస్తూ కెమెరా కంట పడ్డారు. అప్పుడే వీళ్ల వ్యవహారం బయటకు వచ్చింది. ఇక, పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ మరింతగా రచ్చ చేస్తున్నారు. తరచూ ముద్దులు పెట్టుకోవడం, రొమాంటిక్‌గా ఫోజులివ్వడం వంటివి చేస్తూ హాట్ టాపిక్ అయ్యారు.

సిగ్గు విడిచి పర్సనల్ సీక్రెట్ లీక్ చేసేసింది

సిగ్గు విడిచి పర్సనల్ సీక్రెట్ లీక్ చేసేసింది


వివాహం తర్వాత కూడా నిక్ జోనస్.. ప్రియాంక చోప్రా తమ తమ కెరీర్లను సాఫీగా నడుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'వైట్ టైగర్'లో నటించింది. దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఎన్నో విషయాలపై మాట్లాడిందామె. ఈ సందర్భంగా సినిమాతో పాటు పర్సనల్ సీక్రెట్స్ లీక్ చేసింది. అలాగే, వివాహానికి ముందు నిక్‌ జోనస్‌తో జరిగిన అనుభవాలనూ వివరించింది.

పెళ్లికి ముందే ఎంజాయ్.. దానికోసమే కలిసి

పెళ్లికి ముందే ఎంజాయ్.. దానికోసమే కలిసి

ఈ కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడుతూ.. 'మేము వివాహానికి ముందే ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. కెరీర్ పరంగా ఏ దేశంలో ఉన్నా.. మూడు వారాలకు ఒకసారి కలవాలని అనుకున్నాం. అందుకు అనుగుణంగానే కలుస్తూ వచ్చాం. పెళ్లికి అడుగులు పడడానికి కూడా కారణం అదే. వివాహం తర్వాత కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నాం' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X