నాకన్నా పదేళ్లు చిన్న.. అయినా నిక్‌ని ఎందుకు ప్రేమించానంటే.. ప్రియాంక చోప్రా!

Recommended Video

Priyanka Chopra reveals why she fell in love with Nick Jonas

బాలీవుడ్ లో తన సత్తా చాటి హాలీవుడ్ లోకి కూడా ప్రియాంక చోప్రా రాణిస్తోంది. ఆమె ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టార్. 36 ఏళ్ల వయసులో కూడా ప్రియాంక చోప్రా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది. నటిగా కూడా తానేంటో నిరూపించుకుంది. హాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న సమయంలో అమెరికాకు చెందిన యువ సింగర్ నిక్ జోనస్ తో ప్రేమలో పడి వార్తల్లో నిలిచింది. నిక్, ప్రియాంక ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్రియాంక, చోప్రా నిక్ జోనస్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమ గురించి అభిమానుల్లో చర్చ జరుగుతుండగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేసింది.

త్వరలో ఒక్కటి కాబోతున్న జంట

త్వరలో ఒక్కటి కాబోతున్న జంట

ఇటీవలే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ నిశ్చితార్థం హిందూ సంప్రదాయ బద్దంగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరి వివాహ వేడుక జోధ్ పూర్ లో ఘనంగా జరగబోతోంది. 36 ఏళ్ళు ప్రియాంక చోప్రా.. 26 ఏళ్ల నిక్ జోనస్ మధ్య ప్రేమ ఎలా మొదలైందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. ఓ చాట్ షోలో భాగంగా ప్రియాంక చోప్రా తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

అలా జరిగిపోయింది

అలా జరిగిపోయింది

నిక్ తో నా ప్రేమ అలా జరిగిపోయింది. బహుశా అతడు నాకు నా అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడమే కారణం కావచ్చు అని తెలిపింది. అలాగని నిక్ నా కోసం వంటలు వండడం, కాఫీ పెట్టి ఇవ్వడం లాంటి పనులు చేస్తాడని కాదు. తన మనం పడే కష్టానికి ఎవరైనా విలువ ఇస్తే వారిపై అభిమానం పెరుగుతుంది. నిక్ విషయంలో కూడా అదే జరిగిందని ప్రియాంక తెలిపింది.

 డిసెంబర్‌లో వివాహం

డిసెంబర్‌లో వివాహం

డిసెంబర్ లో నిక్, ప్రియాంక వివాహం జరగబోతోంది. కేవలం కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. నిక్ స్నేహితులు, కుటుంబ సభ్యులు 100 మంది హాజరవుతారట. ఏడాది కాలంగా ప్రియాంక, నిక్ పేమ వ్యాహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్.

 పెళ్లి కోసం క్రేజీ సినిమాని

పెళ్లి కోసం క్రేజీ సినిమాని

నిక్ తో వివాహం కోసం ప్రియాంక చోప్రా క్రేజీ సినిమాని వదిలేసుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ భారత్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట ప్రియాంకనే అనుకున్నారు. కానీ నిక్ జోనస్ తో వివాహానికి సిద్ధం అవుతుండడంతో పీసీ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ప్రియాంక స్థానంలోకి కత్రినా కైఫ్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X