twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ తల్లిని కష్టపెట్టొద్దు.. గుండెలు పిండేసిన ప్రియాంక పోస్ట్

    |

    బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన లాక్‌డౌన్ సమయాన్ని భర్త నిక్ జోనస్‌తో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నది. కరోనావైరస్ బాధితులకు ఓ వైపు ఆర్థిక సహాయం, ఇతర రూపంలో హెల్ప్ చేస్తూనే అభిమానులతో లైవ్ ఛాటింగ్‌తో సమయాన్ని గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన జీవితానికి సంబంధించిన విషయాలను, తన సెల్ఫీలను అభిమానులతో పంచుకొంటున్నారు.

    తాజాగా సూర్య కిరణాలు ఆమెను ముద్దాడుతున్నాయా? అనే విధంగా తీసిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక షేర్ చేసిన సెల్ఫీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. తమదైన శైలిలో కామెంట్లు వదులుతున్నారు. ఈ సెల్ఫీకి సుమారు 16 లక్షల లైక్స్ రావడం విశేషం.

    Priyanka Chopras Earthday message and selfie goes viral

    ఇంటర్నేషనల్ ఎర్త్ డే సందర్భంగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన ఫోటోతోపాటు ఓ సందేశాన్ని అభిమానులకు వదిలారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం వేర్వేరుగా జీవిస్తున్నా. మనల్ని ఈ భూమత కలిపి ఉంచింది. ఇదే మనకు శాశ్వతమైన నివాసం. అలాంటి భూమాతను కాలుష్యం బారిన పడకుండా రక్షిద్దాం అని ప్రియాంక తన సందేశాన్ని పోస్టు చేశారు.

    ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తున్న సమయంలో ప్రియాంక, నిక్ జోనస్ పలు రకాలుగా విరాళాలు ప్రకటించారు. యూనిసెఫ్, పీఎం కేర్స్, గూంజ్, ఫీడింగ్ అమెరికా లాంటి సంస్థలకు ప్రియాంక దంపతులు భారీగా విరాళాలు అందించారు.

    కరోనాపై పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుకు ప్రపంచ సినీ ప్రముఖులు పాల్గొన్న వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోం అనే సంగీత విభావరిలో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమంలో లేడి గాగ, సర్ ఎల్టన్ జాన్, జాన్ లెజెండ్, ది రోలింగ్ స్టోన్స్, సామ్ స్మిత్, షాన్ మెండీస్, కెమిలా కాబెల్లో, షారుఖ్ తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Actress Priyanka Chopra's Earthday message and selfie goes viral. We may be apart right now, but Earth keeps us connected. This is our home. Let’s heal Mother Earth together. 🌎 #EarthDay #EarthDayEveryDay.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X