Just In
- 36 min ago
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- 1 hr ago
పవన్, చంద్రబాబు, లోకేష్ అంటే చాలా ఇష్టం.. దేవుడి మీద ఒట్టు.. జనసైనికులను కెలికిన ఆర్జీవీ
- 2 hrs ago
చిరు-కొరటాల మూవీలో హీరోయిన్ ఫిక్స్.. పక్కా ప్రూఫ్.. సోషల్ మీడియాలో వైరల్
- 3 hrs ago
కమల్ పోస్టర్లపై పేడ.. వివాదానికి పుల్‌స్టాప్.. లోక నాయకుడిని కలిసిన లారెన్స్
Don't Miss!
- News
తెలంగాణ మంత్రులకు డబుల్ షాక్...
- Sports
కోహ్లీకి ఎవరూ పోటీలేరు.. అతడికి అతడే పోటీ!!
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఆమె అన్నింటిలోనూ ముందే.. నాకు చాలా నేర్పింది.. సీక్రెట్ బయటపెట్టిన ప్రియాంక భర్త
బాలీవుడ్ టు హాలీవుడ్ అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదిగి గ్లోబల్ స్టార్ అయింది ప్రియాంక చోప్రా. అందరు హీరోయిన్లకు తాను భిన్నం అన్నట్లుగా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడి ప్రత్యేకతను చాటుకుంది. పెళ్లి తర్వాత అమెరికాలోనే సెటిలై భర్తతో జాలీగా గడుపుతోంది ప్రియాంక. కాగా తాజాగా ఆమె భర్త నిక్ జోనస్.. ప్రియాంక గురించి తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ఆసక్తికర సందేశం పోస్ట్ చేశాడు.

అతనితో హాలీడే ట్రిప్పులు.. ఎంజాయ్‌కి కొదవే లేదు
పెళ్ళికి ముందు నుంచే తెగ షికార్లు కొడుతూ ఎంజాయ్ చేసే ప్రియాంక చోప్రా.. పెళ్లయ్యాక భర్తతో హాలీడే ట్రిప్పులు బాగా పెంచేసింది. చిట్టిపొట్టి దుస్తులతో భర్త కౌగిలిలో బీచుల ఒడ్డున ఆమె చేసిన ఎంజాయ్ నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ రకంగా పెళ్లి తర్వాత కూడా తన అందాల ఆరోబోతను నెటిజన్ల ముందుంచింది ప్రియాంక.

ఆమెనే అనుకుంటే.. ఆయన కూడా
భర్త షికార్లు కొట్టడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం ప్రియాంకకు అలవాటు. ఈ పోస్టుల్లో భర్త నిక్ జోనస్ గురించి కూడా ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుంది ప్రియాంక. వీళ్ళ అప్డేట్స్ కోసం నెటిజన్లు సైతం ప్రియాంక ఖాతాపై ఓ కన్నేసి ఉంచుతారు. అయితే ఈ సారి మాత్రం ప్రియాంక చోప్రా రంగంలోకి దిగడం ఆసక్తికర అంశం. సోషల్ మీడియా వేదికగా ప్రియాంక గురించిన కొన్ని విషయాలు చెప్పాడు నిక్ జోనస్.

భర్త కోసం ఆ రోజంతా..
ఉత్తర భారత దేశంలో కార్వా చౌత్ అనే పండుగను ఘనంగా జరుపుకుంటారు. దీపావళి ముందు వచ్చే చవితి రోజు ఈ పండుగ జరుగుతుంది. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తుంటారు భార్యలు. ఇదే ఈ పండుగ స్పెషాలిటీ. ప్రియాంక చోప్రా కూడా తన భర్త కోసం ఇలా ఉపవాస దీక్ష చేసిందట.
|
చాలా పాఠాలు నేర్పింది.. ఆమె అసమానురాలు
ఈ విషయాన్ని ప్రియాంక భర్త నిక్ జోనస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ తన భార్యతో కలిసి దిగిన పిక్ షేర్ చేశాడు. ''నా భార్య ఇండియన్. ఆమె హిందువు. అంతేకాదు అన్నింటిలోనూ ఆమె అసమానురాలు. ఆమె సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆమెను నేనెంతో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మేమిద్దం ఎంతో సరదాగా జీవితాన్ని గడుపుతున్నాం. అందరికీ కార్వా చౌత్ శుభాకాంక్షలు'' అని పేర్కొన్నాడు నిక్ జోనస్.

సినిమాలే కాదు వాటిలోనూ నటిస్తోంది
ఇక ప్రియాంక సినిమా విశేషాలు చూస్తే.. పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేస్తూనే టెక్నాలజీని కూడా సరిగ్గా వాడుకుంటోంది. ఈ మేరకు సరికొత్తగా ఆలోచించి వెబ్ సిరీసుల్లో భాగమవుతోంది. ఇటీవలే 'ది స్కై ఈజ్ పింక్' అనే సినిమాలో నటించి భేష్ అనిపించుకుంది.