For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyanka Chopra మీకు అవే కావాలా? ఆ రొమాన్స్ గురించి మీకెందుకు.. ఘాటుగా ప్రియాంక చోప్రా

  |

  బాలీవుడ్ హీరోయిన్ స్థాయి నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఏ విషయంపై కూడా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. దాపరికం లేకుండా మాట్లాడటం వల్ల చాలా అవకాశాలు, సమస్యలను ఆమె ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నాయి. అయితే తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే ప్రియాంక చోప్రా తాజాగా తన జీవిత కథను అన్‌ఫినిష్‌డ్‌‌గా ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే కొందరు ప్రముఖులు తనకు చేసిన అన్యాయం గురించి ప్రస్తావించింది. అయితే ఇటీవల మీడియాలో ప్రముఖుల పేర్లు చెప్పాలని డిమాండ్ చేయగా ప్రియాంక ఎలా స్పందించారంటే..

   ఆటోబయోగ్రఫిలో జీవిత ప్రయాణం

  ఆటోబయోగ్రఫిలో జీవిత ప్రయాణం

  ప్రియాంక చోప్రా తన ఆటోబయోగ్రఫి అన్‌ఫినిష్‌డ్‌లో తన బాల్యంలోని ప్రేమ కథలు, యూత్‌లో రొమాంటిక్ సంఘటనలను పూసగుచ్చినట్టు వివరించింది. అలాగే కెరీర్ పరంగా బాలీవుడ్‌లో కొందరు నిర్మాత, దర్శకుల నుంచి ఎదురైన అనుభవాలను వెల్లడించింది. అయితే ఎక్కడా కూడా వారి పేర్లను ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకొన్నది. తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ప్రియాంక చోప్రా స్పష్టంగా తెలియజేసింది. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకొన్న తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించిన తీరు.. కెరీర్‌ను చక్కబెట్టుకోవడానికి పాటించిన విధానాలు తెలిపింది. అలాగే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ వరకు, అలాగే గ్లోబల్ ఐకాన్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై సంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన అన్‌ఫినిష్‌డ్‌ పుస్తకానికి అన్ని వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది.

  ఆ ప్రముఖుల పేర్లను చెప్పకపోవడంపై

  ఆ ప్రముఖుల పేర్లను చెప్పకపోవడంపై

  అయితే అన్‌ఫినిష్‌డ్‌ పుస్తకానికి వచ్చిన స్పందన అనంతరం ప్రియాంక చోప్రా మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా తన జీవితంలో సమస్యలు సృష్టించిన ప్రముఖుల పేర్లను ఎందుకు ప్రస్తావించలేదు. ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? లేక ఎలాంటి బెదిరింపులకైనా భయపడ్డారా అంటూ ప్రియాంక చోప్రాను మీడియా ప్రశ్నించింది. అయితే మీడియా తనను ప్రశ్నించడంపై కొంత అసహనం వ్యక్తం చేసింది.

  వాళ్ల నిజస్వరూపం గురించి కాదు..

  వాళ్ల నిజస్వరూపం గురించి కాదు..

  అయితే మీడియా రిపోర్టర్ల ప్రశ్నలపై ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. నా జీవితం పది మందికి తెలియాలన్న కారణంతోనే ఆటోబయోగ్రఫిని తీసుకొచ్చాను. అంతేగానీ ప్రముఖుల నిజస్వరూపం బయటపెట్టడానికి కాదు. పుస్తకాన్ని హుందాగా తీసుకొచ్చాను కానీ, సినీ పరిశ్రమ ప్రతిష్టను మసక బారేలా చేయాలన్నది నా అభిమతం కాదు. అందుకే ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. కేవలం నా జీవితంలోని ముఖ్య సంఘటనలను మాత్రమే ప్రజలకు తెలియపరిచాను అని ప్రియాంక చోప్రా తెలిపారు.

   బురద చల్లాలనే ప్రయత్నం కాదు..

  బురద చల్లాలనే ప్రయత్నం కాదు..

  అన్‌ఫినిష్‌డ్‌ ఆటోబయోగ్రఫి మరొకరి జీవిత చరిత్ర కాదు. అది నా జీవితానికి సంబంధించినది. అందులో మరోకరిపై బురద జల్లడం ఎందుకు? నేను ఎలాంటి అవరోధాలను ఎదుర్కొని వచ్చాను అనేది నాకు ముఖ్యం. అలాంటి విషయాలు ఎదుటి వారికి స్పూర్తిని కలిగిస్తాయని నేను భావిస్తున్నాను. మరొకరిపై ఆరోపణలు చేసి నా పుస్తకానికి పాపులారిటి సంపాదించుకోవడం ఇష్టం లేదు. నా జీవిత కథకు సంబంధించిన పుస్తకం గాసిప్స్ చిట్ట కాదు. మీరు గాసిప్స్ గురించి చాలా తపన పడుతున్నట్టు కనిపిస్తున్నది అంటూ ప్రియాంక చోప్రా చురకలు అంటించింది.

   హుందాగా ఉండాలని మాత్రమే..

  హుందాగా ఉండాలని మాత్రమే..

  అన్‌ఫినిష్‌డ్‌ పుస్తకం ఎలాంటి వివాదాలకు చోటు కల్పించకపోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లర్‌గా మారింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హుందాగా వ్యవహరించడం నాకు ఇష్టం. నా జీవిత కథకు సంబంధించిన పుస్తకం కూడా హుందాగా ఉండాలని కోరుకొన్నాను. అదే రెస్పాన్స్ అందరి నుంచి వస్తున్నది అంటూ ప్రియాంక చోప్రా తెలిపారు.

   ప్రియాంక చోప్రా కెరీర్ ఇలా..

  ప్రియాంక చోప్రా కెరీర్ ఇలా..

  ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. అవెంజర్‌ను రూపొదించిన జో, ఆంథోని రుస్పో నిర్మిస్తున్న సిటాడెల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రిచర్డ్ మ్యాడెన్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నది. అంతేకాకుండా టెక్ట్ ఫర్ యూ, ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్, జీ లే జరా అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

  English summary
  Global Icon Priyanka Chopra says do not degrade My autobiography Unfinished. When She was asked to reveal celebraties name in her memoir.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X