బట్టలు తీసేసి చూపించమన్నాడు.. దాన్నే హైలైట్ చేయాలంటూ.. దర్శకుడి గుట్టు విప్పిన ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు. ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ బ్యూటీలలో ఆమె స్థానం టాప్ లో ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఆమె ఈ రోజుల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ గ్లోబల్ ఐకాన్ కావచ్చు. కానీ కెరీర్ మొదట్లో మోడలింగ్ నుంచి వచ్చినప్పుడు చాలా సమస్యలను ఎదుర్కొంది. అలాగే ఎన్నో రకాల చేదు అనుభవాలను చూసింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంతమంది నుంచి ఆమె ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. అయితే ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ప్రియాంక ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే ఆమె జీవితంలో ఎప్పుడు మరచిపోలేని ఒక సంఘటన కూడా ఉందట.

 స్టార్ హీరోయిన్ గా..

స్టార్ హీరోయిన్ గా..

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరోయిన్స్ సినిమాల నెంబర్లు అనేవి మారుతూనే ఉంటాయి. ఏళ్ళ తరబడి బలంగా నీలదొక్కుకోవడం అంటే అంత సాదరణమైన విషయం కాదు. అయితే ప్రియాంక చోప్రా మాత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై పదేళ్లకు పైగానే స్టార్ హీరోయిన్ గా తన ఖ్యాతిని కొనసాగించింది. ఒకనొక సమయంలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.

 ప్రియాంక రాసిన పుస్తకంలో..

ప్రియాంక రాసిన పుస్తకంలో..

ప్రియాంక చోప్రా జీవితం గురించి అందరికి తెలిసిందే. ఎన్నో విషయాలను ఆమె తను రాసిన పుస్తకంలోనే ఓపెన్ గా చెప్పేసింది. ప్రియాంక ఇటీవల అన్ ఫినిషీడ్ అనే పుస్తకాన్ని రచించింది. తన జీవితంలోని ఎన్నో అనుభవాలను అందులో షేర్ చేసుకున్న ఆమె ఒక దర్శకుడు ప్రవర్తించిన విధానం గురించి కూడా చాలా బోల్డ్ గా తెలియజేసింది.

 చేదు అనుభవం

చేదు అనుభవం

సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఒక మంచి ఆఫర్ అందుకున్న ప్రియాంక ఎలాగైనా ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుందట. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలైన రెండవ రోజు ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. సినిమాలో ప్రియాంక చోప్రా అందలను హైలెట్ చేయాలని కుతూహలంతో చిత్ర దర్శకుడు ఆమెకు నచ్చని విధంగా షూట్ చేయడం అసభ్యంగా అనిపించిదట.

బట్టలు తీసేసి..

బట్టలు తీసేసి..

సినిమాలోని ఒక పాటలో ప్రియాంక చాలా గ్లామరస్ గా కనిపించాలని అనుకుందట. అయితే దర్శకుడు అంతకు మించిప్రియాంక డ్రెస్ లోపల ఇన్నర్ వేర్ కూడా కనిపించాలని అన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు. అయితే ఆ సీన్ ఒప్పుకోవాడనికి కాస్త వెనుకడుగు వేసిన ప్రియాంక వెంటనే డ్రెస్ విషయంలో స్టైలిస్ట్ కు కూడా అడుగగా దర్శకుడు నచ్చజెప్పిన విధానం ఆమెకు మరింత కోపాన్ని బాధని కలిగించిదట. ఈ ఫ్రేమ్ లో ఏం జరిగినా కూడా ప్యాంటీ అయితే కనిపించాలి. లేకుంటే ప్రజలు సినిమాను చూసేందుకు ఎందుకు వస్తారని ఆ దర్శకుడు మొహం మీదే అనేసాడట.

18ఏళ్ళ వయసులో

18ఏళ్ళ వయసులో

దర్శకుడు ముందుగానే తన పక్కన కూర్చొని కూడా స్టైలిస్ట్ తో చెప్పడం ఏ మాత్రం నచ్చలేదని ప్రియాంక తన బుక్ లో పేర్కొంది. ఆమె ప్యాంటిని చూసేందుకు జనం ఎగబడి సినిమాకు రావాలి. అందుకే చాలా చిన్నగా ఉండేదాన్ని చూడమని దర్శకుడు చెప్పిన విధానానికి ప్రియాంక చాలా ఫీల్ అయ్యిందట. అప్పుడు కేవలం తనకు 18 నుంచి 19 సంవత్సరాలు ఉంటాయని ఆ చేదు అనుభవాన్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేనని తెలియజేసింది. అంతే కాకుండా ఆ సినిమా షూటింగ్ రెండు రోజుకు అనంతరం క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వచ్చినట్లు ప్రియాంక పేర్కొన్నరు.

Recommended Video

Bigg Boss Telugu 5, Episode 19 Highlights || Filmibeat Telugu
భర్తతో కలిసి హాట్ స్టిల్స్

భర్తతో కలిసి హాట్ స్టిల్స్

తనకంటే చిన్న వాడైన నిక్ జోనస్ అనే పాప్ సింగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక.. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో భారీ ఫ్యాన్ ఫాలోవర్స్ అందుకున్న ఇండియన్ సెలబ్రేటీలలో ఒకరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X