నీతులు చెప్పడమే తప్ప పాటించరా? దొరికిపోయిన ప్రియాంకపై విమర్శలు!

అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనస్‌ను పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జులై 18న 37వ సంతంలోకి అడుగు పెట్టారు. తన పుట్టినరోజు వేడుకను భర్త జోనస్, తల్లి మధు చోప్రా, మరికొందరు స్నేహితులతో కలిసి యాచ్(పడవ)లో జపుకున్నారు. మియామీ సముద్రతీరంలో విహరిస్తూ ఎంజాయ్ చేశారు.

ఈ వేడుకలో ప్రియాంక చోప్రా సిగరెట్ కాలుస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రియాంక సిగరెట్ తాగుతుంటే... నిక్ జోనస్, మధు చోప్రా సిగార్స్ విలిగించి గుప్పుగుప్పుమంటూ పొగ పీలుస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై కొందరు ప్రియాంకపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

ప్రియాంకపై విరుచుకుపడ్డ నెటిజన్లు

ప్రియాంకపై విరుచుకుపడ్డ నెటిజన్లు

గతేడాది ప్రయాంక చోప్రా దిపావళి సందర్భంగా ఓ వీడియో విడుదల చేశారు. క్రాకర్స్ కాల్చవద్దు, కాలుష్యం సృష్టించద్దని సూచించారు. దీపావళి అంటే లైట్స్, లాడూస్, లవ్ ... పొల్యూషన్ కాదు అంటూ ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. దాన్ని గుర్తు చేస్తూ కొందరు ప్రియాంకపై విరుచుకుపడ్డారు.

మందికి నీతులు చెప్పడమే తప్ప మీరు పాటించరా?

మందికి నీతులు చెప్పడమే తప్ప మీరు పాటించరా?

గతంలో ప్రియాంక చోప్రా ఓ సందర్భంలో స్మోకింగ్ చాలా భయంకరమైనది, చండాలమైనది అంటూ ట్వీట్ చేశారు. దాన్ని కూడా గుర్తు చేస్తూ ప్రియాంకపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. తమరు మందికి నీతులు చెప్పడమే తప్ప మీరు పాటించరా? అంటూ ఫైర్ అయ్యారు.

పెళ్లి సమయంలో కూడా...

పెళ్లి సమయంలో కూడా...

గతంలో తన వివాహం సందర్భంగా కూడా భారీగా బాణసంచా కాల్పడం ద్వారా ప్రియాంక చోప్రా విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇపుడు స్మోకింగ్ చేస్తూ దొరికిపోవడంతో తనపై కామెంట్లు చేసే వారికి మరింత అవకాశం దొరికినట్లయింది.

నిక్-ప్రియాంక

నిక్-ప్రియాంక

తనకంటే వయసులో దాదాపు 10 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ను ప్రియాంక చోప్రా గతేడాది డిసెంబర్లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి హాలీవుడ్ నటుడు డ్వేజ్ జాన్సన్(ది రాక్) వారధిలా నిలిచాడు. అతడి ద్వారా వీరిద్దరూ ఓ పార్టీలో పరిచయం అయ్యారు. ఆపై ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X