బ్యాచిలర్ పార్టీ: ఫుల్లుగా మందేసిన ప్రియాంక చోప్రా అండ్ గ్యాంగ్, హ్యాంగోవర్...

అమెరికన్ సింగర్, నటుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడబోతున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.... ఇపుడు పూర్తిగా వెడ్డింగ్ మూడ్లో ఉంది. పెళ్లికి ముందు జరిగే వివిధ ఈవెంట్లలో పాల్గొంటూ ఖుషీ ఖుషీగా గడుపుతోంది. కొన్ని రోజుల క్రితం న్యూయార్కులో బ్రైడల్ షవర్ పార్టీ జరుగగా... తాజాగా తన గర్ల గ్యాంగ్‌తో కలిసి ఆమ్‌స్టర్‌డామ్‌లో బ్యాచిలర్ పార్టీ జరుపుకుంది.

ఈ బ్యాచిలర్ పార్టీలో ప్రియాంక సిస్టర్ ఇన్ లాతో పాటు, కజిన్ పరిణీతి చోప్రా, స్నేహితులు శ్రిష్ఠి బెహెల్ ఆర్య, తమన్నా దత్, నటాషా పాల్, చంచల్ డిసౌజా, డనా సప్నిక్, గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ సోఫీ టర్నర్ పాల్గొన్నారు.

ఫుల్లుగా మందేశారు...

ఫుల్లుగా మందేశారు...

ప్రియాంక చోప్రా బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే లీక్ అయ్యాయి. పార్టీలో వివిధ రకాల కాక్ టెయిల్స్ సర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఫుల్లుగా మందేయడంతో హ్యాంగోవర్ ఇంకా దిగలేదని ఆమె పోస్టు చేసిన ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

పార్టీలో రచ్చ రచ్చ

అమ్మాయిల బ్యాచిలర్ పార్టీ అంటే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం.... ఇదే తరహాలో ప్రియాంక బ్యాచిలర్ పార్టీ జరిగినట్లు స్పష్టం అవుతోంది. పెగ్గు మీద పెగ్గేస్తూ ప్రియాంక రచ్చ రచ్చ చేసిందట.

ప్రియాంక లుక్ అదిరిపోయింది

ప్రియాంక లుక్ అదిరిపోయింది

బ్యాచిలర్ పార్టీలో ప్రియాంక చోప్రా లుక్ అదిరిపోయే విధంగా ఉంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సులో అభిమానుల మతిపోగొట్టే విధంగా ఆమె ఫోటోలకు ఫోజలు ఇచ్చారు. కొందరైతే అప్పుడే ప్రియాంకకు పెళ్లా... అంటూ నిరాశలో కూరుకుపోయారు.

విందు, వినోదం...

విందు, వినోదం ఇలా ఏ విషయంలోనూ తగ్గకుండా... గ్రాండ్‌గా ఈ బ్యాచిలర్ పార్టీ జరిగింది. ప్రియాంక, గర్ల్ గ్యాంగ్ ఏ రేంజిలో ఎంజాయ్ చేశారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

ఆమెను వీపుపై మోస్తూ...

బ్యాచిలర్ పార్టీ సందర్భంగా హై హీల్స్ వేసుకుని.... ప్రియాంక చోప్రా తన సిస్టర్-ఇన్-లాను తన వీపుపై మోస్తూ సందడి చేశారు. ఈ బ్యాచిలర్ పార్టీలో ప్రియాంక చోప్రా సూపర్ హ్యాపీ మూడ్లో కనిపించారు.

 డిసెంబర్ 2న వివాహం

డిసెంబర్ 2న వివాహం

ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వివాహం డిసెంబర్ 2న ఇండియాలో జరుగబోతోంది. జోధ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కానుంది. తొలుత హిందూ సాంప్రదాయం ప్రకారం, తర్వాత క్రిస్టియన్ స్టైల్‌లో వీరి వెడ్డింగ్ జరుగబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X