twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీ బట్టలన్నీ విప్పాలి...నాకు ప్యాంటీ కనిపించాలి.. డైరెక్టర్ నిర్వాకాన్ని బయటపెట్టిన ప్రియాంక చోప్రా

    |

    బాలీవుడ్‌లో అగ్రతారగా కొనసాగుతుండగానే హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి గ్లోబల్ ఐకాన్‌గా ప్రియాంకచోప్రా మారింది. అయితే తన జీవితంలో చోటు చేసుకొన్న కోన్ని సంఘటనలకు ప్రస్తుతం పుస్తకం రూపం ఇచ్చారు. తన ఆత్మకథను అన్‌ఫినీష్‌డ్ అనే పేరుతో పుస్తకాన్ని ఫిబ్రవరి 9వ తేదీన మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఆ పుస్తకంలో ఎలాంటి అంశాలు వెల్లడించారంటే...

    యూపీలో కుగ్రామం నుంచి హాలీవుడ్‌కు

    యూపీలో కుగ్రామం నుంచి హాలీవుడ్‌కు

    ప్రియాంక చోప్రా తన ఆత్మకథలో పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. యూపీలోని ఓ చిన్న గ్రామం నుంచి వినోద రంగంలో ప్రవేశించినప్పటి నుంచి మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకొనే వరకు, అలాగే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రయాణం లాంటి మధురమైన మెమొరీస్‌తోపాటు ప్లాస్టిక్ చోప్రా, వర్ణ వివక్ష, బాలీవుడ్‌లో నెపొటిజం తదితర అంశాలను పుస్తకంలో పేర్కొన్నారు.

     ప్రియాంక ఆత్మకథ అన్‌ఫినీష్‌డ్

    ప్రియాంక ఆత్మకథ అన్‌ఫినీష్‌డ్

    అన్‌ఫినీష్‌డ్ పుస్తకంలో ఓ బాలీవుడ్ డైరెక్టర్ అరాచకాన్ని బయటపెట్టింది. ఓ ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరించేటప్పుడు నా బట్టలను విప్పమన్నాడు. అయితే అందుకు నిరాకరిస్తూ.. శరీరం కనిపించకుండా చర్మ రంగుతో ఉండే దుస్తులను వేసుకొంటానని చెప్పగా డైరెక్టర్ కోపంతో ఊగిపోయారు. తనను స్టైలిష్ట్‌తో మాట్లాడమని చెప్పడంతో అతడికి ఫోన్ చేశాను అనే విషయాన్ని పుస్తకంలో వెల్లడించారు.

    నీ ప్యాంటీ కనిపించాలి

    నీ ప్యాంటీ కనిపించాలి

    డైరెక్టర్ కోరిక మేరకు నా స్టైలిష్‌తో మాట్లాడగా నాకు షాకింగ్ కలిగించే విషయాలు చెప్పారు. మీరు ఏదైనా వేసుకోండి. కానీ మీరు ధరించిన ప్యాంటీలు కూడా తెరపైన కనిపించాలి. వాటిని చూడటానికే ప్రేక్షకులు సినిమాకు వస్తారని డైరెక్టర్ చెప్పినట్టు స్టైలిష్ట్ చెప్పడంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది అనే విషయాన్ని పుస్తకంలో ప్రస్తావించారు.

    సల్మాన్ ఖాన్ జోక్యంతో

    సల్మాన్ ఖాన్ జోక్యంతో

    ఇక డైరెక్టర్ నిర్వాకంతో నేను ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను. దాంతో ఆయనలో టెన్షన్ మొదలైంది. నేను సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటిస్తున్న షూటింగుకు వచ్చాడు. అప్పటికే సల్మాన్‌కు నేను అంతా చెప్పాను. దాంతో సల్మాన్ డైరెక్టర్‌ను గట్టిగా మందలించారు. నా తరఫున జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అంతటితో ఆగిపోయింది అంటూ పుస్తకంలో తన చేదు అనుభవాన్ని ప్రియాంక వివరించారు.

    English summary
    Bollywood and Hollywood actress Priyanka Chopra memoir Unfinished released on February 9. In ther Memoir revealed sensational things in her book. On director misbehaved with Priyanka Chopra. And asked strip off her clothes, he revealed panties should be seen: Directors attitude revealed in Unfinished.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X