వావ్! ఎంత సెక్సీగా ఉందో: ప్రియాంకను బికినీలో ఫోటోలు తీసిన భర్త
మాజీ మిస్ వరల్డ్, నటి ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత మరింత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనస్‌ను పెళ్లాడిన ఈ బాలీవుడ్ బ్యూటీ యూఎస్ఏలో కాపురం పెట్టిన సంగతి తెలిసిందే. ఇద్దరికి కాస్త ఖాళీ సమయం దొరకడంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్.. ప్రస్తుతం ఇటలీలోని టుస్కానీ అనే ప్రాంతంలో గడుపుతున్నారు. తన భర్తతో కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నానో వెల్లడిస్తూ ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అంతే కాదు తన భర్తలోని ఫోటోగ్రఫీ టాలెంట్ గురించి పొడ్తలు గుప్పించారు.

ప్రియాంకను బికినీలో ఫోటోలు తీసిన భర్త
ఇద్దరూ స్విమ్మింగ్ ఫూల్‌లో జలకాలాడుతుండగా.....తన అందమైన భార్యను స్విమ్ సూట్లో మరింత అందంగా తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. నిక్ జోనస్ తీసిన ఈ ఫోటోలను ప్రియాంక చోప్రా అభిమానులతో పంచుకున్నారు.

భర్త టాలెంటు చూసి మురిసిపోయిన ప్రియాంక
భర్తలోని ఫోటోగ్రఫీ టాలెంట్ చూసి ప్రియాంక చోప్రా మురిసిపోయారు. బికినీలో తనను మరింత సెక్సీగా ఫోటో షూట్ చేయడం ఆమెకు తెగ నచ్చేంది. తన అందమైన ఫోటోలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ట్విట్టర్లో పెట్టేశారు. ఈ పోస్టుకు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఓ వైపు ప్రశంసలు, మరో వైపు విమర్శలు
ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఫోటోలపై అభిమానుల నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఇండియన్ కల్చర్ పేరుతో ప్రియాంకను తప్పు బట్టే ప్రయత్నం చేస్తుండగా... నిక్ జోనస్ నీ భర్తలా లేడు, కొడుకులా ఉన్నాడంటూ మరికొందరు అభ్యంతరకర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.

ప్రియాంక చోప్రా-నిక్ జోనస్
తనకంటే వయసులో దాదాపు 10 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ను ప్రియాంక చోప్రా గతేడాది డిసెంబర్లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి హాలీవుడ్ నటుడు డ్వేజ్ జాన్సన్(ది రాక్) వారధిలా నిలిచాడు. అతడి ద్వారా వీరిద్దరూ ఒక పార్టీలో పరిచయం అయ్యారు. ఆపై ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

ప్రియాంక చోప్రా-నిక్ జోనస్
నిక్‌తో ప్రేమలో పడటం అలా జరిగిపోయింది. బహుశా అతడు నాకు, నా అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడమే కారణం కావచ్చు. మనం పడే కష్టానికి ఎవరైనా విలువ ఇస్తే వారిపై అభిమానం పెరుగుతుంది. నిక్ విషయంలో కూడా అదే జరిగిందని ప్రియాంక గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











