ఆ పనికి తప్ప మగాళ్లు మాకు అవసరం లేదు.. ప్రియాంక చోప్రాపై ఘాటు వ్యాఖ్యలు!
ప్రియాంక చోప్రా వివాహం చేసుకున్నప్పటి నుంచి ఎదో ఒక రూపంలో విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. డిసెంబర్ 1న ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు అధికారికంగా ఒక్కటయ్యారు. హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాలలో ప్రియాంక వివాహం జరిగింది. ప్రియాంక, నిక్ వివాహం జరగగానే ఓ అంతర్జాతీయ సంస్థ జర్నలిస్ట్ ప్రియాంకపై విషం కక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది.

నిక్‌ని ముగ్గులోకి దించి
ఒక పథకం ప్రకారమే ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ని ప్రేమలోకి దించింది అని సదరు మహిళా జర్నలిస్ట్ ఆర్టికల్ ప్రచురించింది. డబ్బు, సెక్స్ కోసమే ప్రియాంక ఆరాటం అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వెంటనే ప్రియాంక కుట్రని గమనించి నిక్ జోనస్ ఆమె నుంచి విడిపోవాలని కూడా సదరు జర్నలిస్ట్ సలహా ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి. నలువైపుల నుంచి వస్తున్న విమర్శలతో ఆ మహిళా జర్నలిస్ట్ ప్రియాంక, నిక్ కి బహిరంగ క్షమాపణలు తెలియజేసింది.

మగాడు అందుకు మాత్రమే
తాజగా మరో మహిళా నెటిజన్ ప్రియాంక చోప్రాని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.దీపికా భరద్వాజ్ అనే మహిళ ట్వీట్ చేస్తూ.. పిల్లలు కనడానికి తప్ప మగాళ్లు ఇంకే పనికి అవసరం లేదు అని కొందరు బాలీవుడ్ ఫెమినిస్ట్ లు అరచి గోలపెట్టి మరీ చెబుతారు. కానీ వారికీ నచ్చిన మగాడు దొరకగానే నుదుట సింధూరం ధరించి అందమైన వధువుగా మారిపోతారు. అతనొక ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు ఈ బాలీవుడ్ ఫెమినిస్ట్ లు అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అసలు రూపం ఇది
మేము మహిళా వాదులం అని చెప్పుకుని తిరిగే వారంతా పెళ్లి కాగానే అసలు పేరు కూడా మార్చేసుకుంటారు అంటూ దీపికా ఘాటుగా చురకలు అంటించింది. ఇటీవల ప్రియాంక తన పేరుని ప్రియాంక చోప్రా జోనస్ అని మార్చుకుంది. మహిళావాదులుగా చెప్పుకునే బాలీవుడ్ మహిళల అసలు రూపం అని దీపికా ఘాటుగా వ్యాఖ్యానించింది.

సింధూరం స్త్రీజీవితానికి
దీపికా భరద్వాజ్ వ్యాఖ్యలపై ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. సింధూరం స్త్రీజీవితానికి అడ్డు కాదు. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా త్వరలోనే నిరూపిస్తుంది అని సున్నితంగా స్పందించారు.


Click it and Unblock the Notifications











