For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దుమారం రేపుతున్న ప్రియాంక సెల్ఫీ.. హీరోయిన్ నిర్వాకంపై దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

  |

  ప్రియాంక చోప్రా.. ఈ పేరు ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఆమె భారతీయులపై ప్రభావం చూపించింది. ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకీ అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అదే సమయంలో అక్కడ నిక్‌ జోనస్‌ అనే ఓ సింగర్ నచ్చడంతో అతడితో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. దీంతో అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ దుమారాన్ని రేపుతోంది. ఇంతకీ ఏంటా పిక్..? ఎందుకంత హైలైట్ అయింది..?

  ఢిల్లీ పొల్యూషన్‌పై ప్రియాంక చోప్రా రియాక్షన్
  ఫారెన్ కల్చర్‌తో హాట్ టాపిక్

  ఫారెన్ కల్చర్‌తో హాట్ టాపిక్

  హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రియాంక ప్రవర్తనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె అక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఇది మరింత ఎక్కువైంది. గతంలో పబ్లిక్‌లో భర్తను లిప్ లాక్ ఇవ్వడం వంటివి చేసింది. ఇది అక్కడ సర్వసాధారణమే అయినా.. మన దేశంలో కాదు కాబట్టి ప్రియాంకను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. అయినా, ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.

  సిగరెట్ కాల్చుతూ కనిపించింది

  సిగరెట్ కాల్చుతూ కనిపించింది

  కొద్ది రోజుల క్రితం ప్రియాంక.. భర్త నిక్‌ జోనస్‌తో కలిసి పుట్టిన రోజు సంబరాలను ఘనంగా జరుపుకుంది. అప్పుడు ఆమె అమెరికాలోని మయామి ప్రాంతంలోని ఒక ప్రైవేటు బోటులో ప్రయాణించింది. ఆ సమయంలో ఆమె భర్త మరికొందరితో కలిసి సిగరెట్ కాలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు విరుచుకు పడ్డారు.

  వేల మంది ముందు ముద్దు

  ఇటీవల అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రియాంక భర్త నిక్.. అతడి సోదరులు కలిసి ఓ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ఆమె కూడా వెళ్లింది. ఆ సమయంలో వేల మంది చూస్తుండగానే నిక్.. ప్రియాంక పెదాలను ముద్దాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

  దుమారం రేపుతున్న ఫొటో

  తరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తున్న ప్రియాంక.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో మాస్క్ ధరించి ఉన్న ఆమె ‘‘ద వైట్ టైగర్' సినిమా షూటింగ్ కోసం వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ షూట్ చేయడం చాలా కష్టం. అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారో ఊహించలేకపోతున్నాను. మాకు ఎయిర్ ప్యూరిఫయర్లు, మాస్కులు ఉండడం వల్ల బాగున్నాము. నిరాశ్రయుల కోసం ప్రార్థించండి' అంటూ రాసుకొచ్చింది.

  ఇండియాలో ఇలా.. అక్కడ అలానా?

  ప్రియాంక చేసిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గతంలో సిగరెట్ కాల్చుతూ పోస్ట్ చేసిన ఫొటోలను గుర్తు చేస్తూ ఆమెను తిట్టి పోస్తున్నారు. ఇండియాలో నీతులు చెప్పడం.. ఫారెన్‌లో మాత్రం జల్సా చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ప్రియాంక క్లీవేజ్ ఫొటోను షేర్ చేసినప్పటికీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

  English summary
  Bollywood Star Heroine Priyanka Chopra, who turned a year older on July 18, continued her birthday celebrations on a yacht in Miami. What has caught the attention of citizens is the picture of Priyanka smoking a cigarette, while Nick and Madhu enjoy cigars.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X