నా బుగ్గలు కందిపోయి, ఎర్రటి టామాటాగా మారాను.. నిక్ అలా చేశాడు.. ప్రియాంక

ఇప్పటి వరకు ప్రేమలో మునిగి తేలిన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులుగా మారబోతున్నారు. డిసెంబర్ 1న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమేద్ భవన్ ప్యాలెస్‌లో వీరి వివాహాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో అతిథులు అక్కడికి చేరుకొన్నారు. ఈ సందర్బంగా ప్రియాంక తన కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ప్రియాంక ఏం చెప్పిందంటే..

ప్రేమ ఎలా పుట్టిందంటే

ప్రేమ ఎలా పుట్టిందంటే

ఏడాది క్రితం వ్యానిటీ ఫెయిర్ ఆస్కార్ పార్టీలో కలుసుకొన్నాం. ఒకరికొకరం రొమాంటిక్‌గా ప్రేమ సందేశాలను పంపుకొన్నాం. చిన్న చిన్న సరదాలతో రొమాంటిక్ లైఫ్‌ను పంచుకొన్నాం. ఆ విధంగా మా మధ్య ప్రేమ పుట్టింది. అలా మేము దగ్గరయ్యాం అని ప్రియాంక చెప్పింది.

నా కోసమే పుట్టిందని

నా కోసమే పుట్టిందని

మేము మూడుసార్లు కలుసుకొన్న తర్వాత ఒకరికి మరొకరిపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఒకరోజు తన తల్లిని నిక్ పిలిచి.. నా కోసమే ఈమె పుట్టింది అని చెప్పాడు. నా బర్త్ డే రోజున గ్రీస్‌లో రొమాంటిక్‌గా నాకు ఉంగరం తొడిగి ప్రేమను వ్యక్తం చేశాడు అని ప్రియాంక వెల్లడించింది.

నిక్‌ జోనాస్‌తో ప్రేమలో

నిక్‌ జోనాస్‌తో ప్రేమలో

ప్రియాంక ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాకు తెలియకుండా ప్రైవసీని మెయింటెన్ చేస్తుంది. కానీ ఓ రోజు తన నిక్‌తో ఫోటో దిగి వారి రిలేషన్ గురించి బహిరంగ పరచడం షాక్ గురిచేసింది. దాంతో ప్రియాంక, నిక్ ప్రేమాయణం ప్రపంచానికి అధికారికంగా తెలిసింది.

నా బుగ్గలు ఎరుపెక్కేలా

నా బుగ్గలు ఎరుపెక్కేలా

ఏడాది కాలంగా నిక్‌తో గడిపిన క్షణాలు అద్భుతంగా ఉంటాయి. నేనేంటో మరిచిపోయే విధంగా మార్చేశాడు. నాపై నిక్ కురిపించే ప్రేమతో నా బుగ్గలు ఎర్రగా కందిపోయేవి. నేను ఓ ఎర్రటి టమాటాలా మారిపోయేదాన్ని అని చాలా రొమాంటిక్‌గా ప్రియాంక చోప్రా తన అనుభవాలను పంచుకొన్నది.

క్రిస్టియన్, హిందూ మతాల ప్రకారం

క్రిస్టియన్, హిందూ మతాల ప్రకారం

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పెళ్లి డిసెంబర్ 1న క్రిస్టియన్ మత ఆచారం ప్రకారం, డిసెంబర్ 2న హిందూ సంప్రదాయం ప్రకారం జరుగునున్నది. వీరి పెళ్లికి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వేదికగా మారింది. పెళ్లి కూతురు ప్రియాంక కోసం ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ దస్తులను డిజైన్ చేశారు.

 డిసెంబర్ 4న రిసెప్షన్

డిసెంబర్ 4న రిసెప్షన్

పెళ్లి తర్వాత ప్రియాంక, నిక్ భారీ విందును ఏర్పాటు చేయబోతున్నారు. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల కోసం ఢిల్లీ, ముంబైలో రెండు విలాసవంతమైన రిసెప్షన్లు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4న ముంబై తాజ్‌లో విందును ఏర్పాటు చేశారు. సంజయ్ లీలా భన్సాలీ, రణ్‌బీర్ కపూర్, అలియాభట్, షారుక్, బిగ్‌బీ ఫ్యామిలీలను ఆహ్వానించినట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X