Priyanka Chopra బికినీలో శృంగార దేవతలా.. న్యూ ఇయర్ రచ్చ మామూలుగా లేదుగా

చేదు అనుభవాలతో తీపి అనుభవాలను ఇచ్చిన 2021 సంవత్సరానికి ముగింపు పలుకుతూ సినీ తారలు హడావిడిగా కనిపించారు. స్నేహితులు, సన్నిహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొనేందుకు ప్లాన్ చేశారు. 2022 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు.. కొత్త అనుభవాలను, అనుభూతులను తమ జీవితంలో నింపుకొనేందుకు సిద్దమవుతున్నారు. అందరి మాదిరిగానే ప్రియాంక చోప్రా ఎలా స్వాగతం పలుకుతున్నారంటే..

ప్రియాంక చోప్రా ఘనంగా

ప్రియాంక చోప్రా ఘనంగా

సినిమా పరిశ్రమకు చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ.. 2021 సంవత్సరంప్రియాంక చోప్రాకు సానుకూలంగానే మారింది. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగానే కనిపించారు. అలాగే ముంబై ఫిలిం ఫెస్టివల్‌కు చైర్ పర్సన్‌గా కూడా ఎంపిక కావడం ఆమె కెరీర్‌లో ఓ క్రెడిట్‌గా మారింది. ఇంకా భవిష్యత్ కార్యాచరణను ఘనంగా ప్లాన్ చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నది.

నిక్ జోనస్‌తో దాంపత్య జీవితం

నిక్ జోనస్‌తో దాంపత్య జీవితం

ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెలెస్ నగరంలో భర్త నిక్ జోనస్‌తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నది. ఇటీవల దీపావళీ పండుగను కూడా ఘనంగా జరుపుకోవడం తెలిసిందే. షూటింగులతో బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా మిస్ చేసుకోకుండా ప్లాన్ చేసుకొంటున్నారు. ప్రియాంక చోప్రా ఇలాంటి మధురానుభూతుల మధ్య కొత్త సంవత్సరానికి వేచి చూస్తున్నారు.

 2022 స్వాగతం పలుకుతూ..

2022 స్వాగతం పలుకుతూ..

ఇటీవల 2022 సంవత్సరాన్ని ఘనంగా స్వాగతిస్తూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పొట్టారు. నవ్వుల్లో మునిగి తేలుతూ.. ఊయలలో ఊగుతూ అందంగా కనిపించింది. మోడరన్ కళ్లద్దాలు, డిజైనర్ డ్రెస్‌తో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకొన్నారు. తన నివాసంలో దిగిన ఫోటోను షేర్ చేయగా ఇన్స్‌ట్రామ్‌లో వైరల్ అయింది. ఫోటో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 13 లక్షలకుపైగా లైక్స్ సంపాదించుకొన్నది.

 ఎరుపు రంగు బికినీలో

ఎరుపు రంగు బికినీలో

ప్రియాంక చోప్రా షేర్ చేసిన రెండో ఫోటో రచ్చ లేపింది. సముద్ర తీరంలో ఎరుపురంగు బికినీలో ఓడపై నిలుచుని శృంగారం ఒలకబోస్తూ కెమెరాకు ఫోజిచ్చింది. 2021లో చివరి రోజు అంటూ కామెంట్ చేసింది. 2021 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2022 స్వాగతం చెబుతూ రచ్చ చేసింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Priyanka Singh Emotional | Final Nominations || Filmibeat Telugu
ప్రియాంక చోప్రా కెరీర్ ఇలా..

ప్రియాంక చోప్రా కెరీర్ ఇలా..

ఇక ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల హాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్ చిత్రంలో సతి అనే పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇంకా జిమ్ స్ట్రాస్‌తో కలిసి టెక్ట్స్ ఫర్ యూ, జో, అంథోనితో కలిసి సిటాడెల్, లాగే ఆలియాభట్, కత్రినా కైఫ్‌తో కలిసి జీ లే జార చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X