ప్రియాంక చోప్రా కంటతడి.. మరిది పెళ్లిలో ఏం జరిగిందంటే..
ప్రియంక చోప్రా మరిది జో జోనస్ వివాహం నటి సోఫి టర్నర్‌తో ఘనంగా జరిగింది. ఫ్రాన్స్‌లో డెస్టినేషన్ మ్యారేజ్‌గా జరిగిన వేడుకలో ప్రియాంక దంపతులు హంగామా చేశారు. భారతీయ సంప్రదాయ పద్దతిలో చీరకట్టులో కనిపించి కనువిందు చేశారు. అయితే అంతా సవ్యంగా జరుగిపోతున్న సమయంలో ఒక్కసారిగా ప్రియాంక చోప్రా భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లనిండా తడితో ఎమోషనల్‌గా మారారు.
ప్రియాంక కంటతడి పెట్టుకొంటున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కంటతడి పెట్టుకొనే సమయంలో భర్త నిక్ జోనస్ పక్కనే ఉన్నారు. డిజైనర్ సవ్యసాచి రూపొందించిన పింక్ కలర్ చీరలో అందంగా కనిపించారు. స్లీవ్ లెస్ జాకెట్‌లో గ్లామరస్‌గా మెరిసారు. అయితే ఆమె భావోద్వేగంగా మారడానికి కారణం మాత్రం తెలియరాలేదు.

సోఫీ, జో జోనస్ వివాహం అత్యంత నిరాడంబరంగా ఓ ప్రైవేట్ కార్యక్రమంగా జరిగింది. జూన్ 30న ఫ్రాన్స్‌లోని చాట్యూ డు మార్టినేలో జరిగిన పెళ్లికి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మే 1 తేదీని లాస్ వెగాస్‌లో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది.
గతేడాది డిసెంబర్‌లో ప్రియాంక, నిక్ జోనస్ వివాహం రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఉమేద్ భవన్ ప్యాలెస్ వేదికైంది. వీరి వివాహం క్రిస్టియన్, హిందూ మతాల ప్రకారం జరిగింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే.
ప్రియాంక చోప్రా విషయానికి వస్తే, సోనాలి బోస్ రూపొందిస్తున్న ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరిగింది. ఈ చిత్రంలో ఫర్హాన్ అఖ్తర్, జైరా వసీం నటిస్తున్నారు. అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











