ప్రియాంకా నిక్ ఉదారత్వం... బీహార్, అస్సామ్ వరద భాధితులకు సహాయం

దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా, పెళ్లి చేసుకుని విదేశాల్లోనే స్థిరపడినప్పటికీ, ఆమె తన మూలాలను మాత్రం మరచిపోలేదు. ఎక్కడ ఉన్నా, ఆమె మనసు ఇక్కడ ఉందనటానికి తాజా సంఘటన మరో ఉదాహరణగా నిలస్తోంది. భర్తతో కలసి బీహార్, అస్సాం వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది.

అసలే కరోనా సృష్టించిన అల్లకల్లోలంతో దేశం మొత్తం సతమతమవుతున్న తరుణంలో, ఉత్తరాదిన వరదలు భీభత్సాన్ని సృష్టించాయి. ముఖ్యంగా బీహార్, అస్సామ్ కు వరద తాకిడి ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. పకృతి విలయతాండవానికి, లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి తన వంతు సహాయం అందించేందుకు ప్రియాంకా చోప్రా ముందుకురాగా, ఆమెకు తోడుగా భర్త నిక్ జోనాస్ కూడా జత కలిశాడు.

Priyanka- Nick winning Hearts, Donates Flood hit Bihar and Assam

బీహార్, అస్సామ్ ప్రభుత్వాలకు ఆర్ధిక సహాయం అందించినట్లు, జంటగా ఓ స్టేట్మెంట్ విడుదల చేసిన ప్రియాంకా నిక్, అక్కడితో చేతులు దులిపేసుకోకుండా, వీలైనంత సహాయం అందించమంటూ తమ స్నేహితులు, ఫ్యాన్స్ ను కూడా కోరారు. అధికారిక నివేదిక ప్రకారం వరదల కారణంగా అస్సామ్ లో సుమారు 22 జిల్లాలు ప్రభావితం అయ్యాయి. 22 లక్షల మంది నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరి ప్రియాంకా నిక్ ను ఆదర్శంగా తీసుకుని మరింత మంది సెలబ్రిటీలు ముందుకు వస్తారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X