Don't Miss!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అతనే తాప్సీ భర్త.. అంతా సిద్దం వచ్చే నెలలోనే.. ఎంతో గర్వంగా ఉందన్న హీరో
టాలీవుడ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తాప్సీ మరో చిత్రానికి ఓకే చెప్పింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అథ్లెట్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించబోతొన్న ప్రియాన్షు పెయిన్యూలి కొన్ని ఆసక్తికర విశేషాలను తెలియజేశాడు. అవేంటో ఓ సారి చూద్దాం.
తాప్సీ భర్తగా..
ప్రియాన్షు అప్‌స్టార్స్ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యాడు. తాజాగా తాప్సీ హీరోయిన్గా నటిస్తున్న రష్మీ రాకేట్ చిత్రంలో హీరోగా ఎంపికయ్యాడు. ఈ సినిమాలో తాప్సీ భర్తగా నటిస్తున్నానని తెలిపాడు.
ఎంతో గర్వంగా ఉంది..
డిఫెన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం, ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించడం ఎంతో గర్వంగా ఉందని అన్నాడు. ఈ క్యారెక్టర్‌ను ఎంతో బాధ్యతతో పోషిస్తానని తెలిపాడు.
వచ్చే నెలలోనూ..
ఇప్పటికే ఈ ఏడాది శుభారంభమే అయింది.. ఈ ఏడాది అంతా అలానే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి.. వచ్చే నెలలోనే షూటింగ్ మొదలు కానున్నాయని పేర్కొన్నాడు. ఢిల్లీ, కచ్, ముస్సోరి, డెహ్రాడున్ వంటి ప్రాంతాల్లో షూట్ చేయబోతోన్నామని తెలిపాడు.
Recommended Video
స్పోర్ట్స్ డ్రామాలతో బిజీ..
ఇప్పటికే తాప్పీ సూర్మా, సాండ్ కీ ఆంఖ్ వంటి స్పోర్ట్స్ డ్రామాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. రీసెంట్ మిథాలీ రాజ్ బయోపిక్ అయిన శభాస్ మిథూ చిత్రాన్ని పట్టాలెక్కించింది. మళ్లీ ఇప్పుడు అథ్లెట్ అవతారాన్ని ఎత్తబోతోంది.