twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతనే తాప్సీ భర్త.. అంతా సిద్దం వచ్చే నెలలోనే.. ఎంతో గర్వంగా ఉందన్న హీరో

    |

    టాలీవుడ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తాప్సీ మరో చిత్రానికి ఓకే చెప్పింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అథ్లెట్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించబోతొన్న ప్రియాన్షు పెయిన్యూలి కొన్ని ఆసక్తికర విశేషాలను తెలియజేశాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

    తాప్సీ భర్తగా..

    తాప్సీ భర్తగా..

    ప్రియాన్షు అప్‌స్టార్స్ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యాడు. తాజాగా తాప్సీ హీరోయిన్‌గా నటిస్తున్న రష్మీ రాకేట్ చిత్రంలో హీరోగా ఎంపికయ్యాడు. ఈ సినిమాలో తాప్సీ భర్తగా నటిస్తున్నానని తెలిపాడు.

    ఎంతో గర్వంగా ఉంది..

    ఎంతో గర్వంగా ఉంది..

    డిఫెన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం, ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించడం ఎంతో గర్వంగా ఉందని అన్నాడు. ఈ క్యారెక్టర్‌ను ఎంతో బాధ్యతతో పోషిస్తానని తెలిపాడు.

    వచ్చే నెలలోనూ..

    వచ్చే నెలలోనూ..

    ఇప్పటికే ఈ ఏడాది శుభారంభమే అయింది.. ఈ ఏడాది అంతా అలానే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి.. వచ్చే నెలలోనే షూటింగ్ మొదలు కానున్నాయని పేర్కొన్నాడు. ఢిల్లీ, కచ్, ముస్సోరి, డెహ్రాడున్ వంటి ప్రాంతాల్లో షూట్ చేయబోతోన్నామని తెలిపాడు.

    Recommended Video

    #CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
    స్పోర్ట్స్ డ్రామాలతో బిజీ..

    స్పోర్ట్స్ డ్రామాలతో బిజీ..

    ఇప్పటికే తాప్పీ సూర్మా, సాండ్ కీ ఆంఖ్ వంటి స్పోర్ట్స్ డ్రామాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. రీసెంట్ మిథాలీ రాజ్ బయోపిక్ అయిన శభాస్ మిథూ చిత్రాన్ని పట్టాలెక్కించింది. మళ్లీ ఇప్పుడు అథ్లెట్ అవతారాన్ని ఎత్తబోతోంది.

    English summary
    Priyanshu Painyuli About Taapsee And Rashmi Rocket. He will be playing the role of an army officer and Taapsee's husband in the sports film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X