ప్రముఖ నిర్మాత కూతురు మృతి.. 21 ఏళ్ల వయసులోనే తిరిగి రాని లోకాలకు!
బాలీవుడ్ నిర్మాత, టీ సీరిస్ అధినేత భూషణ్ కుమార్ సోదరుడు కిషన్ కుమార్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కిషన్ కుమార్ కూతురు త్రిషా కుమార్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సంస్థ అధికార ప్రతినిధి మీడియాకు సమాచారం అందించారు. ఈ విషాద వార్తతో స్నేహితులు,సన్నిహితులు, సినీ వర్గాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషాద వార్త వివరాల్లోకి వెళితే..
కిషన్ కుమార్ కుమార్తే త్రిష వయసు 21 సంవత్సరాలు. ఆమెకు కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆమెకు జర్మనీలోని ప్రముఖ హస్పిటల్‌లో చికిత్స అందించారు. కొద్ది నెలలుగా ఆమెను అక్కడే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ క్రమంలో ఆమె శుక్రవారం రాత్రి మరణించారు అని తెలిపారు.

కిషన్ కుమార్ కూతురు మరణ వార్త వినగానే బాలీవుడ్, ఇతర సినీ వర్గాలు సంతాపం తెలిపాయి. ఇలాంటి విషాద సమయంలో మనోధైర్యంతో ఉండాలని కుటుంబానికి నైతిక మద్దతును అందించారు. త్రిష మృతికి సంతాపం తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగంతుడిని ప్రార్థించారు.
ఇదిలా ఉండగా, కిషన్ కుమార్ మీడియాకు సూచన చేస్తూ.. మా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించకూడదు. దయచేసి మా రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకొంటారని భావిస్తున్నాం అని ఓ ప్రకటనలో తెలిపారు.
కిషన్ కుమార్ విషయానకి వస్తే.. ఆయన కూడా నటుడిగా రాణించారు. ఆజా మేరి జాన్, కసమ్ తేరీ కసమ్, శబ్నం, బేవఫా సనమ్, పాపా ది గ్రేట్ సినిమాల్లో నటించారు. తన సోదరుడు గుల్షన్ కుమార్ హత్య తర్వాత నిర్మాతగా మారారు. రెడీ, లక్కీ, నో టైమ్ ఫర్ లవ్, ఎయిర్ లిఫ్ట్, సత్యమే జయతే, తానాజీ, సోనుక కే టిటు కీ స్వీటి, భూల్ భులయ్యా 2, తప్పడ్ తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











