బాలీవుడ్‌లో మరో ప్రముఖుడు కన్నుమూత.. విషాదంలో కరణ్ జోహర్, ఫరాన్ తదితరులు
బాలీవుడ్‌లో మరో ప్రముఖుడు కన్నుమూశారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్ గుండెపోటుతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో మరణించారు. కుల్మీత్ మరణ వార్తను గిల్డ్ అసోసియేషన్ ప్రసిడెంట్ అశోక్ పండిట్ ధృవీకరించారు. ఆయన మృతితో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
కుల్మీత్ మరణంపై అశోక్ పండిట్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నా ప్రియమైన మిత్రుడు కుల్మీత్ మక్కర్ ఇకలేరనే విషయాన్ని చెప్పడానికి చాలా బాధాగ ఉంది. ఆయన ఆకస్మిక మరణం విషాదాన్ని నింపింది. ఆయన ధర్మశాలలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు.

కుల్మీత్ మక్కర్ మృతిపై కరణ్ జోహర్ స్పందిస్తూ.. కుల్మీత్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు నీవు పిల్లర్ లాంటి వాడివి. సినీ పరిశ్రమ పురోగతికి నీవు అవిశ్రాంతంగా సేవలందించావు. ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తావని అనుకోలేదు. నీతో అనుబంధం, నీ సేవలు చిరకాలం గుర్తుంచుకొంటాం. నా స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటున్నాను అని కరణ్ జోహర్ ట్వీట్ చేశారు.
ప్రతీ ఉదయం ఎవరో సినీ ఒక ప్రముఖుడి మరణవార్తతో నిద్ లేవడం చాలా విషాదకరంగా మారింది. నా మిత్రుడు కుల్మీత్ మరణవార్త చాలా బాధించింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో ఆయన సేవల చిరస్మరణీయం అని ఫరాన్ అఖ్తర్ అన్నారు.
కరోనావైరస్ కారణంగా కష్టాలు పడుతున్న వేతన కార్మికుల కోసం దేశవ్యాప్తంగా వారిని ఆదుకోనేందుక పక్కా ప్రణాళికను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి దుర్వార్త రావడం శోచనీయం అని సినీ ప్రముఖులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











