twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సర్జికల్ స్ట్రైక్ 2' కోసం బాలీవుడ్‌లో రేస్.. మతి పోగొట్టేలా టైటిల్స్!

    |

    ఇండియన్ ఆర్మీ, టెర్రర్ అటాక్ కి సంబంధించిన ఎలాంటి ఘటన జరిగినా దానిని సినిమాగా తెరకెక్కించేందుకు బాలీవుడ్ వాళ్ళు పోటీ పడుతుంటారు. 26/11 ముంబై దాడులు, 2016లో జరిగిన యురి అటాక్ పై ఇప్పటికే చిత్రాలు విడుదలయ్యాయి. యురి అటాక్, దానికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ పై గత ఏడాది యురి ది సర్జికల్ స్ట్రైక్ పేరుతో చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఏకంగా ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనితో ఆర్మీ నేపథ్యం ఉన్న చిత్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇటీవల జరిగిన పుల్వామా ఘటన నేపథ్యంలో సినిమా తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైపోతోంది.

     పుల్వామా ఘటన

    పుల్వామా ఘటన

    ఫిబ్రవరి 14న పాక్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆత్మాహుతి దాడి జరిపి 49 భారత సైనికుల మరణానికి కారణం అయ్యారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసింది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలనే వాదన మరోమారు బలంగా వినిపించింది. పుల్వామా అటాక్ లాంటి పైశాచిక ఘటనకు పాల్పడింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. పాకిస్థాన్ అడ్డాగా చేసుకునే ఈ ఉగ్రవాద సంస్థ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది.

    సర్జికల్ స్ట్రైక్ 2

    సర్జికల్ స్ట్రైక్ 2

    ఇక ఉపేక్షితే లాభం లేదని భావించిన ఇండియా పుల్వామా ఘటన జరిగిన 12 రోజుల్లోనే జైషే మహమ్మద్ ని చావుదెబ్బ కొట్టి అమర జవానులకు ఘనమైన నివాళి అర్పించింది. భారత వైమానిక దళాలు మెరుపులు దాడులు జరిపి కేవలం 20 నిమిషాల్లోనే జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేశారు. ఈ ప్రక్రియలో 300 మంది ఉగ్రవాదులు నాశనమయ్యారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చాటింది. 1000 కేజీల బాంబుని మిరాజ్ యుద్ధవిమానం సాయంతో నేరుగా పాకిస్థాన్ కు వెళ్లి విసరడం విశేషం.

    ఆసక్తికరమైన కథ

    ఆసక్తికరమైన కథ

    దీనిని వెండితెరపై కథగా మలిస్తే అద్భుతమైన చిత్రం అవుతుందనేది బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆలోచన. ఇప్పటికే యురి చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు రాబట్టడంతో జనాలు ఇలాంటి చిత్రాలపై ఎంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారో అర్థం అవుతోంది. ప్రేక్షకుల అభిరుచి మేరకు సర్జికల్ స్ట్రైక్ 2పై చిత్రాన్ని రూపొందించడానికి బాలీవుడ్ లో పలు నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించేసాయి. సర్జికల్ స్ట్రైక్ 2పై సినిమా కోసం పదుల సంఖ్యలో టైటిల్ రిజిస్టర్ అవుతున్నాయి.

     మతిపోగొట్టేలా

    మతిపోగొట్టేలా

    పలువురు దర్శకులు, నిర్మాతలు వారి క్రియేటివిటీకి తగ్గట్లుగా టైటిల్స్ రిజిస్టర్ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు పుల్వామా ది టెర్రర్ అటాక్, పుల్వామా అటాక్ వర్సస్ సర్జికల్ స్ట్రైక్ 2.0, బాలాకోట్, వార్ రూమ్, హిందుస్థాన్ హమారా హై, ది అటాక్స్ ఆఫ్ పుల్వామా, విత్ లవ్, ఫ్రమ్ ఇండియా, ఏటీఎస్ వన్ మాన్ షో లాంటి టైటిల్స్ రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. దీనితో సర్జికల్ స్ట్రైక్ 2పై ముందుగా చిత్రాన్ని ప్రారంభించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ప్రారంభించేశారు.

    English summary
    Pulwama to Surgical Strike 2: Production houses put up tough fight for film titles
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X