టీవీ యాక్టర్ దారుణ హత్య.. వివాహేతర సంబంధమే.. పక్కా ప్లాన్‌తో భర్త!
ప్రముఖ పంజాబీ టెలివిజన్ తార అనితా సింగ్ దారుణ హత్యకు గురవ్వడం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. దారుణంగా కుళ్లిపోయిన అనితా సింగ్ దేహాన్ని నైనిటాల్ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. అనితా సింగ్ హత్య పట్ల పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ హత్య కేసు వివరాల్లోకి వెళితే..

భర్త చేతిలోనే ప్రాణాలు..
టీవీ నటి అనితా సింగ్ హత్యకు కారణం ఆమె భర్త రవిందర్ పాల్ సింగ్, స్నేహితుడు కులదీప్ కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. స్నేహితుడు కుల్దీప్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొంటున్నారు. హత్య కేసుకు సంబంధించిన క్లూస్‌ని సేకరిస్తున్నారు. ఇప్పటికే పలు ఆధారాలను పోలీసుల సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

వివాహేతర సంబంధమే కారణమని
అనితా సింగ్ హత్యకు కారణం వివాహేతర సంబంధమేనని పోలీసులు వెల్లడిస్తున్నారు. గత కొద్దికాలంగా కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తితో అనితా సింగ్ వివాహేతర సంబంధం పెట్టుకొన్నది. ఆ విషయంపై భర్త రవిందర్ సింగ్‌కు ఆమెకు అభిప్రాయ బేధాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

పక్కా స్కెచ్ ప్రకారం భర్త మర్డర్ ప్లాన్
అనితా సింగ్ హత్యకు ముందు భర్తతో గొడవలు జరిగాయని దర్యాప్తులో బయటకు వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ముంబైకి మకాం మార్చే అంశం భార్య, భర్తల మధ్య చిచ్చు రేపింది. ఆ క్రమంలో అనితాను చంపేందుకు స్నేహితుడితో కలిసి రవిందర్ సింగ్ కుట్ర పన్నారు. తన స్నేహితుడికి బాలీవుడ్‌లో మంచి పరిచయాలు ఉన్నాయి. తను నీకు హెల్ప్ చేస్తాడని నమ్మించి నైనిటాల్‌కు తీసుకెళ్లి హత్యకు ప్లాన్ చేశారు అని మీడియా వర్గాలు వెల్లడించాయి.

అనితా సింగ్ హత్య ఇలా..
ఇక అనితా సింగ్‌ను నైనిటాల్‌కు తీసుకెళ్లిన తర్వాత తన కుల్దీప్ సింగ్‌తో కలిసి రవిందర్ సింగ్ హత్యకు కుట్ర పన్నారు. టీలో మత్తు పదార్థాలు కలిపి ప్రైవేట్ ప్లేస్‌కు తీసుకెళ్లారు. అపస్మారక స్థితిలోకి చేరుకోగానే గొంతు నిలిమి చంపారు. ఆ తర్వాత ఆమె దేహాన్ని పెట్రోల్ పోసి కాల్చారు అని మీడియా వర్గాల రిపోర్టులో వెల్లడైంది.

అనితా సింగ్ భర్త అరెస్ట్
నైనిటాల్‌లో సంచలనం రేపిన అనితా సింగ్ హత్య కేసును స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చేధించారు. అద్దెకు తీసుకొన్న వాహనం డ్రైవర్ సహాయంతో అనితా సింగ్ మృతదేహాన్ని తరలించే సీన్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడ్డాయి. ఈ దారుణమైన వ్యవహారంలో భర్త రవిందర్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











