»   » షాకింగ్.. ప్రముఖ గాయకుడిపై ఫైరింగ్.. కాల్చింది మేమే అంటూ..

షాకింగ్.. ప్రముఖ గాయకుడిపై ఫైరింగ్.. కాల్చింది మేమే అంటూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకొన్నది. పంజాబీ గాయకుడు పర్మీష్ వర్మపై దారుణంగా కాల్చులు జరిపారు. ఈ ఘటనలో పర్మీష్ స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి మొహాలిలోని ఫేజ్ 8 ఇండస్ట్రీ ఏరియాలో ఈ దారుణం చోటుచేసుకొన్నది. గాల్ ని కద్ని పాట ద్వారా సంగీత ప్రియులకు పర్మీష్ వర్మ సుపరిచితులు. పర్మీష్ కాల్పులకు గురికావడం దేశీ సంగీత ప్రియులను దిగ్బ్రాంతికి గురిచేసింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పర్మీష్ వర్మ గాయపడి

పర్మీష్ వర్మ గాయపడి

ప్రస్తుతం పర్మీష్ వర్మ, అతని స్నేహితుడి పరిస్థితి గురించి ఇంకా చెప్పలేం. వారి ప్రాణాలకు ముప్పేమీ లేదు. మొహాలీలోని ఫోర్టీస్ హాస్పిటల్‌లో చికిత్సనందిస్తున్నారు. వర్మ మోకాలిలో తుపాకీ గుళ్లు దూసుకుపోయాయి అని పోలీసులు వెల్లడించారు.

 యూట్యూబ్ సెన్సేషన్

యూట్యూబ్ సెన్సేషన్

పంజాబీ గాయకుడిగా పర్మీష్ వర్మ ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణను మూటగట్టుకొన్నారు. ఆయన పాడిన పాట గాల్ని కద్ని అనే పాటకు యూట్యూబ్‌లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ పాటకు 118 మిలియన్ల వ్యూస్ రావడం సంచలనంగా మారింది.

27 మిలియన్ల వ్యూస్

27 మిలియన్ల వ్యూస్

పర్మీష్ వర్మ తాజాగా పడిన షాదా అనే పాట కూడా య్యూటూబ్‌లో సంచలనం రేపింది. మూడు వారాల క్రితం పాడిన ఆ పాటకు దాదాపు 27 మిలియన్ల వ్యూస్ రావడం విశేషంగా మారింది. పర్మీష్‌ను గ్యాంగ్‌స్టర్లు కొంతకాలంగా టార్గెట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేయడం మీడియా దృష్టికి వచ్చింది.

కాల్పులు జరిపిందే మేమే

పర్మీష్ వర్మపై కాల్పులు జరిపింది తామే అని దిల్‌ప్రీత్ సింగ్ ధాహాన్ ఫేస్‌బుక్‌లో ప్రకటించుకొన్నారు. నేను దిల్ ప్రీత్ సింగ్‌ను. పర్మీష్ వర్మపై కాల్పులు జరిపింది నేనే అంటూ పోస్టు పెట్టారు. తలకు తుపాకీ పెట్టుకొని ఉన్న తన ఫోటోతోపాటు పర్మీష్ వర్మ చిత్రాన్ని దిల్ ప్రీత్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

English summary
Famous Punjabi singer Parmish Verma and a friend were shot on the intervening night of Friday and Saturday in Phase 8, Industrial Area, Mohali. Parmish Verma is a famous Punjabi singer with his smash hit ‘Gaal ni kadni’ having over 11 crore views on YouTube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X