పుష్ప2 జాతర సీక్వెన్స్ కాపీ.. అచ్చు దింపేసిన హిందీ స్టార్.. ఎవరు? ఏ సినిమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా నటించిన చిత్రం పుష్ప 2 : ది రూల్ చిత్రంతో అలరించిన తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సినిమాకు భారీగా వసూళ్లు అందాయి. వరల్డ్ వైడ్ గా హ్యయెస్ట్ గ్రాసింగ్ సాధించిన 3వ చిత్రంగానూ ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రంలోని జాతర సీక్వెన్స్ ను హిందీ సీరియల్ లో కాపీ కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. హిందీ టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతున్న టాప్ సీరియల్ లో తెలుగు భారీ చిత్రం పుష్ప 2 సినిమాలోని సీక్వెన్స్ ను కాపీ కొట్టడం ఇండియా వైడ్ గా చర్చగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
పుష్ప చిత్రం క్రియేట్ చేసిన రికార్డులివే..
2021లో తొలుత పుష్ప : ది రైజ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అద్బుతంగా నటించారు. ఐకాన్ స్టార్ నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు వరించడం విశేషం. ఇక ఈ చిత్రంలో పుష్ప రాజ్ మేనరిజాన్ని క్రికెట్ స్టార్స్ ఫాలో అవ్వడం సెన్సేషన్ గా మారింది. మరోవైపు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, బీజీఎం కూడా వరల్డ్ వైడ్ గా మోత మోగించాయి.

యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ ఈ చిత్రానికి సంబంధించిన వీడియోలు ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఇక పుష్ప 2 : ది రూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వరల్డ్ వైడ్ గా హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన 3వ చిత్రంగానూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక పుష్ప 2 చిత్రానికి గానూ రీసెంట్ గా అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ ను అందుకోవడం విశేషం.
ఇప్పటికే పుష్ప 1 నుంచి సాంగ్ కాపీ..
పుష్ప : ది రైజ్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఫుల్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ' సాంగ్ వరల్డ్ వైడ్ గా మోత మోగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగ్ లో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి వేసిన మాస్ స్టెప్పులు సంచలనంగా మారాయి. నాలుగేళ్లైనా ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండింగ్ లోనే ఉంది. అయితే ఈ సాంగ్ ను ఇంగ్లీష్ ఆల్బమ్ లో రీసెంట్ గా కాపీ కొట్టారని రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. వారిపై కాపీ రైట్ కేసు పెట్టాలని ఆలోచిస్తున్నట్టు రీసెంట్ గా ఓ ఫిల్మ్ వేడుకలో చెప్పారు.
హిందీ సీరియల్ పుష్ప 2 ఫుల్ జాతర ఎపిసోడ్ కాపీ..
హిందీ టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాప్ సీరియల్ జామై నెం.1. ఈ సీరియల్ జీ5 ఛానెల్ లో ప్రసారం అవుతోంది. బాలీవుడ్ సీరియల్ నటుడు అభిషేక్ మాలిక్, ఫీమేల్ లీడ్ లో సిమ్రాన్ కౌర్ నటించడం విశేషం. ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో ఇది టాప్ రేటింగ్ లో ఉంది. అయితే ఇలాంటి ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ లో పుష్ఫ 2 : ది రూల్ చిత్రంలోని జాతర సీక్వెన్స్ ను కాపీ కొట్టారు. అచ్చం పుష్ప 2లో అల్లు అర్జున్ లాగే అభిషేక్ మాలిక్ అమ్మవారి వేషధారణలో ఉగ్రరూపంలో కనిపించారు. శత్రువులపై దాడి చేసే సీక్వెన్స్ ను అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.


Click it and Unblock the Notifications











