హాట్ హాట్‌గా రాయ్ లక్ష్మీ... మీడియాలో కేక పుట్టించిన బర్త్ డే బేబీ ఫొటోలు
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా అందాలతో ఆకట్టుకొంటున్న హీరోయిన్ రాయ్ లక్ష్మీ. ఈ వారం ఆమె జీవితంలో రెండు ప్రత్యేకతలు చోటుచేసుకొన్నాయి. మే 5వ తేదీ ఆమె బర్త్ డే కాగా, మరోటి సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 14 ఏళ్లు పూర్తి చేసుకోవడం. రాయ్ లక్ష్మీ బర్త్ డే సందర్భంగా పలువురు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు అందించారు. అయితే బాలీవుడ్ నటి, టీవీ యాక్టర్ షమా సికిందర్ తెలిపిన బర్త్ డే విషెస్, షేర్ చేసిన వీడియోలు మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఆ ఫోటోలు మీ కోసం. .

రాయ్ లక్ష్మీ బర్త్ డే సందర్భంగా
రాయ్ లక్ష్మీ బర్త్ డే సందర్భంగా ఆమెతో కలిసి బీచ్‌లో బికినీలో చేసిన హంగామా ఫోటోలను షమా సికందర్ షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే నా స్వీట్, బ్యూటీఫుల్, అందమైన చిన్నారి రాయ్ లక్ష్మీకి ప్రపంచంలోని సంతోషమంతా ఆమెకే దక్కాలి అంటూ బర్త్ డే విషెస్ తెలిపింది. నీ ప్రేమ, ఆదరణ నాకు అత్యంత బలం. లవ్ యూ అంటూ కామెంట్ పెట్టింది.

థాయ్‌లాండ్‌లో రచ్చ రచ్చ
గతంలో రాయ్ లక్ష్మీ, షామా సికందర్ ఇద్దరు థాయ్‌లాండ్ బీచుల్లో రచ్చ రచ్చ చేశారు. వాస్తవానికి బికినీ ఫొటోలో ఒకదానిని రాయ్ లక్ష్మీ గతంలో షేర్ చేసింది. దానికి సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన లభించింది. అందాల ఆరబోతను నెటిజెన్లు ఫుల్లుగా ఆస్వాదించారు.

14 ఏళ్లు కెరీర్‌లో
ఇక రాయ్ లక్ష్మీ కెరీర్ విషయానికి వస్తే, 1989, మే 5న జన్మించిన రాయ్ లక్ష్మీ 2005లో తన కెరీర్‌ను ప్రారంభించింది. మే 6, 2005న తమిళ చిత్రం కర్కా కసదరా చిత్రంలో నటించడం ద్వారా తమిళ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగులోకి ప్రవేశించింది.

దక్షిణాదిలో అగ్రహీరోలతో రాయ్ లక్ష్మీ
తెలుగు, తమిళ, కన్నడ రంగాల్లో సత్తా చాటింది. శ్రీకాంత్, బాలకృష్ణ, రవితేజ, పవన్ కల్యాణ్, చిరంజీవి లాంటి అగ్రహీరోల సినిమాల్లో కనిపించింది. ఇటీవల జూలీ 2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ సరైన విజయం దక్కడంతో కొంత నిరాశ ఎదురైంది.

వెంకటలక్ష్మీగా తెలుగులో
ఇటీవల తెలుగులో వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సిండ్రెలా, నీయా 2, ఝాన్సీ చిత్రాల్లో నటిస్తున్నది. సిండ్రెలా చిత్రంలో రాయ్ లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు తెలిపారు.


Click it and Unblock the Notifications











