For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘రాధే’ నుంచి సీటీమార్ సాంగ్ రిలీజ్: అల్లు అర్జున్‌పై సల్మాన్ ఊహించని ట్వీట్.. రేంజ్ పడిపోయిందంటూ!

  |

  ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాల కంటే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే మూవీల రేంజ్ భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. అందుకే మన చిత్రాలకు అక్కడ బాగా డిమాండ్ ఉంటోంది. అలాగే, మన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కోసం హిందీ ఫిల్మ్ మేకర్లు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే టాలీవుడ్‌ సాంగ్స్‌ను కూడా రీమేక్ చేసుకోడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ 'రాధే' మూవీ కోసం అల్లు అర్జున్ పాటను రిమిక్స్ చేసుకున్నారు. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తూ.. సల్లూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

  Seeti Maar From Radhe Released - Allu Arjun Reacts | Filmibeat Telugu
  ద మోస్ట్ వాంటెడ్ భాయ్ అంటూ వస్తున్నాడు

  ద మోస్ట్ వాంటెడ్ భాయ్ అంటూ వస్తున్నాడు

  బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. సౌతిండియన్ స్టార్ ప్రభుదేవా ఈ సినిమాను రూపొందించాడు. మేఘా ఆకాశ్‌, దిశాప‌టానీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ర‌ణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని స‌ల్మాన్‌, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు.

  రెండు భారీ హిట్ల తర్వాత ప్రభుదేవా.. సల్మాన్

  రెండు భారీ హిట్ల తర్వాత ప్రభుదేవా.. సల్మాన్

  గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్', ‘దబాంగ్' వంటి చిత్రాల్లో నటించాడు. ఈ రెండూ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ఫిల్మ్‌గా ‘రాధే' రాబోతుంది. దీంతో భారీ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ముంబైలోని డ్రగ్స్ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.

  నేరుగా ఓటీటీతో పాటు థియేటర్లలోకి వస్తుంది

  నేరుగా ఓటీటీతో పాటు థియేటర్లలోకి వస్తుంది

  2017లో వచ్చిన కొరియన్ సినిమా ‘ద ఔట్ లాస్‌' అనే సినిమాకు ‘రాధే' రీమేక్‌గా వస్తోంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నారు. అదే రోజు ఓటీటీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇలా ఏక కాలంలో థియేటర్లలో, ఓటీటీలో విడుదల అవుతోన్న మొదటి చిత్రంగా ఇది రికార్డుల్లో స్థానం సంపాదించింది.

  సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ సాంగ్

  సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘రాధే'కు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నటించిన ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్' సినిమాలోని సీటీమార్.. సీటీమార్ అనే పాటను ఇందులో రీమిక్స్ చేశారు. దీన్నే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో చూపించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ దీనిపై ఆసక్తితో ఉన్నారు.

  పాట విడుదల.. బన్నీకి థ్యాంక్స్ చెప్పిన సల్లూ

  పాట విడుదల.. బన్నీకి థ్యాంక్స్ చెప్పిన సల్లూ

  తాజాగా ‘రాధే' సినిమాలోని సీటీమార్ సాంగ్ విడుదలైంది. దీనికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. అల్లు అర్జున్ రేంజ్‌లో లేకపోయినా తనదైన స్టెప్పులతో సల్మాన్ అలరించాడు. ఇక, ఇది విడుదల చేస్తూ.. ‘బ్రదర్ అల్లు అర్జున్.. సీటీమార్ సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ పాటలో నీ డ్యాన్స్, స్టైల్స్ అద్భుతం. జాగ్రత్తగా ఉండు' అంటూ బన్నీకి ట్వీట్ చేశాడు సల్మాన్ ఖాన్.

  రేంజ్ పడిపోయిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు

  రేంజ్ పడిపోయిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు

  అల్లు అర్జున్‌ను ఉద్దేశిస్తూ సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్‌‌తో పాటు అందులో డ్యాన్స్‌ చేసిన విధానంపై ట్రోల్స్ వస్తున్నాయి. ‘సల్మాన్ లెవెల్ పడిపోయిందా? బన్నీ లెవెల్ పెరిగిందా' అని ఒకరు అంటే.. పాట చూడగానే బన్నీ.. సల్మాన్‌ను కొడుతున్నట్లు మరికొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. కొందరు ఐకాన్ స్టార్ అభిమానులు మాత్రం హుందాగా ప్రవర్తించి సినిమాకు విషెస్ చెబుతున్నారు.

  సల్మాన్ చేసిన ట్వీట్‌పై అల్లు అర్జున్ కామెంట్

  సల్మాన్ చేసిన ట్వీట్‌పై అల్లు అర్జున్ కామెంట్

  కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఈ మేరకు తన ఖాతాలో ‘చాలా ధన్యవాదాలు సల్మాన్ గారు. మీ నుంచి ఇలాంటి ప్రశంస అందుకోవడం సంతోషంగా ఉంది. మీ రాధే మ్యాజిక్‌ను స్క్రీన్‌పై చూసి అభిమానులంతా సీటీమార్ కొట్టాలని ఆశిస్తున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు.. అల్లు అర్జున్' అంటూ పోస్ట్ చేశాడు.

  English summary
  Radhe: Your Most Wanted Bhai is an upcoming Indian action film directed by Prabhu Deva and produced by Salman Khan, Sohail Khan and Atul Agnihotri. The film stars Salman Khan, Megha Akash Disha Patani, Randeep Hooda and Jackie Shroff.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X