సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే అతిచిన్న సినిమా.. ఆ మూవీ రన్‌టైమ్ తెలిస్తే షాకే!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నుంచి ఒక సినిమా వచ్చింది అంటే మినిమమ్ పవర్ఫుల్ కలెక్షన్స్ అందుతుంటాయి. దాదాపు మొదటి వీకెండ్ లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది. సినిమా టాక్ తో సంబందం లేకుండా వసూళ్లను రాబట్టడంలో సల్మాన్ తరువాతే ఎవరైనా. ఈ స్టార్ హీరో రాధే సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా గత ఎడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. ఇక మొత్తానికి జీ సంస్థ సినిమా సర్వ హక్కులను కొనుగోలు చేసి ఒకేసారి ఓటీటీ, థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇక సినిమా రన్ టైమ్ 1గంట 54నిమిషాలని తెలుస్తోంది. గతంలో ఎప్పుడు కూడా సల్మాన్ సినిమాలు ఇంత తక్కువ నిడివితో రాలేదు.

కానీ మొదటిసారి సల్మాన్ ఖాన్ కెరీర్ లో రాధే సినిమా రెండు గంటలలోపే రన్ టైమ్ ఫిక్స్ చేసుకోవడం విశేషం. ఇక సినిమా జీ ఫ్లెక్స్ లో మే 13న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. పే పర్ వ్యూ పద్దతిలో 249 రూపాయలు ఛార్జ్ చేయనున్నారట. ఆ రేటుపై పలు విమర్శలు వస్తున్నప్పటికీ తప్పకుండా ఓటీటీలో మంచి వసూళ్లను ఆదుకుంటుందని కామెంట్స్ వస్తున్నాయి. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. ఒకవేళ రాధే ప్లాన్ వర్కౌట్ అయితే అదే తరహాలో ఓటీటీలో మరికొన్ని సినిమాలు రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











