భాగ్యశ్రీ కూతురు బాలీవుడ్ ఎంట్రీ.. వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెడుతున్న ముద్దుగమ్మ!

హిందీ చిత్ర పరిశ్రమలో 90వ దశకంలో తన అందం, అభినయంతో ఆకట్టుకొన్న హీరోయిన్లలో భాగ్యశ్రీ ఒకరు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి ఈ ముద్దుగమ్మ నటించిన మైనే ప్యార్ కియా చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం అందుకోవడంతో ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయ్యారు. అయితే ఆమె ఎక్కువ కాలం, ఎక్కువ సినిమాల్లో నటించకుండానే సినిమాల నుంచి తప్పు కోవడం అభిమానులను నిరాశకు గురించి చేసింది. అయితే మళ్లీ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించడమే కాకుండా తన కూతురును బాలీవుడ్‌కు పరిచయం చేస్తూ ముందుకొస్తున్నది. నటి భాగ్యశ్రీ. గురించి, ఆమె కూతురుకు సంబంధించిన సినిమాల గురించిన విషయాలు మీ కోసం..

మైనే ప్యార్ కియా మూవీతో..

మైనే ప్యార్ కియా మూవీతో..

మైనే ప్యార్ కియా అందించిన విజయాన్ని కెరీర్‌కు ఉపయోగపడేలా మలుచుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు అంటి ముట్టనట్టుగా ఉంది. మధ్యలో బెంగాలీ, భోజ్‌పూరి, మరాఠి చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. అయితే ఆ సినిమాల వల్ల భాగ్యశ్రీకి పెద్దగా ఉపయోగం లేకపోయింది.

రాధేశ్యామ్ చిత్రంలో భాగ్యశ్రీ

రాధేశ్యామ్ చిత్రంలో భాగ్యశ్రీ

ఇలాంటి పరిస్థితుల్లో భాగ్యశ్రీ తెలుగు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో యువరత్న రానా అనే చిత్రంలో నటించినా పెద్దగా పేరు రాలేదు. అయితే ఇటీవల జయలలిత బయోపిక్ తలైవి చిత్రంలో ఓ మంచి పాత్రతో మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ అంతగా ఆమెకు పేరు తెచ్చినట్టు కనిపించలేదు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంలో ఓ కీలకపాత్రను పోషించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

భాగ్యశ్రీ కూతురు అవంతిక బాలీవుడ్‌లోకి

భాగ్యశ్రీ కూతురు అవంతిక బాలీవుడ్‌లోకి

ఓ పక్క తన కెరీర్‌ను మంచిగా మలచుకొనే ప్రయత్నం చేస్తూనే కూతురు అవంతిక దస్సానీ హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నది. మిథ్య చిత్రం ద్వారా అవంతిక సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్నారు. బ్రిటన్ సిరీస్ చీట్ అనే చిత్రం ఆధారంగా రూపొందుతున్న మిథ్యలో హ్యుమా ఖురేషీ లాంటి బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రొఫెసర్, స్టూడెంట్ మధ్య సంబంధాలను కొత్త కోణంలో చర్చించబోతున్నారు.

పవర్‌ఫుల్ క్యారెక్టర్‌తో ఎంట్రీ

పవర్‌ఫుల్ క్యారెక్టర్‌తో ఎంట్రీ


ఇక తన సినిమా రంగ ప్రవేశం గురించి అవంతిక దస్సానీ మాట్లాడుతూ.. నా తొలి చిత్రంలోనే సవాల్ విసిరే కథతో, పవర్‌ఫుల్ క్యారెక్టర్ లభించడం అదృష్టం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి నటించడం గర్వంగా ఉంది. నా సహచర నటులు నన్ను ప్రోత్సహించిన తీరుకు ఆనందంగా ఉంది. మిథ్య చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. నా తొలి సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

భాగ్యశ్రీ కొడుకు బాలీవుడ్‌కు పరిచయం

భాగ్యశ్రీ కొడుకు బాలీవుడ్‌కు పరిచయం


ఇదిలా ఉండగా, భాగ్యశ్రీ తన కుమారుడిని కూడా బాలీవుడ్‌కు పరిచయం చేసింది. 2018లో భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దస్సానీ నటించిన మర్ద్ కో దర్ద్ నహీ హోతా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు తన కూతురిని ఓ మంచి కథాబలం ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తల్లి మాదిరిగానే అవంతిక ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే విషయాన్ని పరిశీలించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X