For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ చిత్రంలో నగ్నంగా.. అలాంటి పాత్రలే వస్తున్నాయ్.. రాధికా ఆప్టే కామెంట్స్

    |

    రక్త చరిత్ర, ఎమ్ ఎస్ ధోని, లెజెండ్, లయన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాధికా ఆప్టే బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అటుపై రాను రాను బోల్డ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది రాధికా ఆప్టే. బద్లాపూర్, అహల్య, లస్ట్ స్టోరీస్, వెడ్డింగ్ గెస్ట్ ఇలా ప్రతీ సినిమాల్లో అడల్ట్ సీన్స్‌లో నటించిన రాధికా ఆప్టేకు వరుసలా అలాంటి పాత్రలే వస్తున్నాయట. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

    అలాంటి పాత్రలే చేస్తారు కదా..

    అలాంటి పాత్రలే చేస్తారు కదా..

    ఓసారి కథ చెప్పడానికి ఓ దర్శకుడు తన వద్దకు వచ్చాడని చెబుతూ... అందులో తనది వేశ్య పాత్ర అని చెప్పాడని తెలిపింది. అదేంటి అని తాను అడిగితే.. ‘మీరు నటించిన బద్లాపూర్, అహల్య సినిమాల్లో మీరు దుస్తులిప్పేసి అలాంటి పాత్రల్లోనే నటించారు కదా. వరుసగా అవే పాత్రల్లో నటిస్తున్నారు కదా' అని అన్నాడని చెప్పుకొచ్చింది. దాంతో తాను షాక్ అయ్యానని తెలిపింది.

    అత్యాచారాలపై సినిమా అంటూ..

    అత్యాచారాలపై సినిమా అంటూ..

    దేశంలో జరుగుతున్న ఘోర అత్యాచారాల నేపథ్యంలో సినిమా తీస్తానని మరో దర్శకుడు తన వద్దకు వచ్చాడని తెలిపింది. అందులో తనది ప్రధాన పాత్ర అని చెప్పాడని, ఓ మహిళ తనపై అత్యాచారం చేసిన వారిపై పగ తీర్చుకునేందుకు ఆమె కూడా రేపిస్ట్‌గానే మారిపోతుందనే ఓ పిచ్చి కాన్సెప్ట్‌ను చెప్పాడని తెలిపింది. అలా చేయడం తప్పు అన్న మెసేజ్‌ని కూడా సినిమాలో చూపిస్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చానని, ఇందులో అమ్మాయే అబ్బాయి అని చెప్పాడని. అలాంటి సినిమా తీయాల్సిన అవసరం లేదు కదా అని ఆయనతో చెప్పినట్లు తెలిపింది.

    నగ్నంగా నటించాను..

    నగ్నంగా నటించాను..

    హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్‌తో కలిసి ‘వెడ్డింగ్ గెస్ట్'అనే సినిమా చేశానని, అందులో తనకు, దేవ్‌కు బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలిపింది. అందులో ఏకంగా తన వక్షోజాలు, ఇతర ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేశారని చెప్పుకొచ్చింది. దాంతో తాను కేవలం సెక్స్ సన్నివేశాలు ఉన్న పాత్రల్లోనే నటిస్తానని చాలా మంది అనుకున్నారని తెలిపింది.

    #CineBox : Nani's New Film Titled Tuck Jagadish
     ఏదోక కారణం ఉండాలి..

    ఏదోక కారణం ఉండాలి..

    అలాంటి కథలను తాను అస్సలు ఒప్పుకోనని, ఒకవేళ ఒప్పుకున్నా కూడా అందులో బలమైన కారణం ఉండాలని పేర్కొంది. అవేమీ లేకుండా ఏదో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకే అలాంటి సన్నివేశాలను చూపించడం కరెక్ట్ కాదని తెలిపింది.

    English summary
    Radhika Apte About Adult Characters. She Said That Many Directors Approaching Her Only For Adult CONTENT Movies. But She Is Not Ready To Do That Movie With Out Strong Reason In Story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X