ఆ అఫైర్ బయటపెట్టు.. యువ హీరో వ్యవహారంపై నోరు విప్పిన రాధిక ఆప్టే!
Recommended Video
యూరీ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రజాదరణను కూడగట్టుకొన్న వికి కౌశల్ బాలీవుడ్‌లో టాప్ రేసులోకి వచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నాడు. సక్సెస్ జోష్‌లో పరుగులు పెడుతున్న ఈ యువ హీరో ఇటీవల తన ప్రేయసి హర్లీన్ సేథికి బ్రేకప్ చెప్పాడు. అయితే తాజాగా మరో హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల నేహా దూపియా చాట్ షోలో పాల్గొన్న ఈ సుందరి వికీ కౌశల్ అఫైర్ గురించి నోరు విప్పారు. ఆమె ఏమన్నారంటే..

మాళవిక మోహనన్‌తో డేటింగ్
మాళవిక మోహనన్‌తో వికి కౌశల్ డేటింగ్ చేస్తున్న వార్తలు నిజమే. వికీ, మాళవిక, ఆమె సోదరుడు నాకు వారు చిన్నప్పటి నుంచే తెలుసు. వారి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అయితే వికీ, మాళవిక మధ్య స్నేహం కంటే మరో బంధం ఎక్కువగా ఉంది. నా సోదరుడితో కూడా మాళవికకు మంచి రిలేషన్స్ ఉన్నాయి అని రాధిక ఆప్టే తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

మాళవిక, వికీ మంచి జోడి
మాళవిక మోహనన్‌తో రిలేషన్‌ను వికీ అంగీకరించాలి. మాళవిక మంచి అమ్మాయి. లవ్లీగా ఉంటుంది. వికీ కూడా లవ్లీ బాయ్. వారిద్దరూ బయటకు వచ్చి వారి మధ్య ఉన్న రిలేషన్‌ను బాహ్య ప్రపంచానికి వెల్లడించాలి. తమ మధ్య ఉన్న ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. అలాంటప్పుడే ఒత్తిడి తగ్గుతుంది. మీడియాలో రకరకాల వార్తలు, గాసిప్స్ ఆగిపోతాయి. వారిద్దరివి మంచి జోడి అని రాధిక ఆప్టే చెప్పింది.

వికీ కౌశల్, మాళవిక రిలేషన్
వికీ కౌశల్ ఎంత బిజీగా ఉన్నా మాళవిక ఇంటికి వస్తాడు. లంచ్ లేదా డిన్నర్ డేట్‌కు తీసుకెళ్తాడు. గత కొద్దికాలంగా వారి మధ్య రిలేషన్ మరింత బలపడింది. వారి మధ్య సన్నిహిత సంబంధాలు కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం మాళవిక తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలోనే ఉంటున్నది. ఆమెను ఆ ఇంటిలోనే వికీ తరుచూ కలుస్తుంటాడు అని రాధిక ఆప్టే పేర్కొన్నారు.

యూరీ తర్వాత వికీ కౌశల్ కెరీర్
వికీ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే, యూరీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. భాను ప్రతాప్ సింగ్ తెరకెక్కించే భూత్ పార్ట్‌వన్ చిత్రంలో వికీ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భూమి పడ్నేకర్ కథా నాయిక. నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతున్నది. ఇంకా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











