twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విచ్చలవిడిగా మద్యం తాగి.. ఆ తప్పు చేశాను... అందుకే శిక్ష అనుభవించా.. రాధికా ఆప్టే

    |

    బాలీవుడ్‌నే కాకుండా సౌత్ ఇండస్ట్రిని తన నటనతో ఆకట్టుకొన్న రాధికా ఆప్టే మనసులో ఉన్నదున్నట్టు మాట్లాడుతుంది. బోల్డ్‌గా మాట్లాడే తీరును బట్టే ఆమెకు ఫిదా అవుతుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను బయటపెట్టింది. తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలను పంచుకొన్నది. గతంలో తనను వెంటాడిన ఘటనలను పూసగుచ్చినట్టు వెల్లడించింది. తన ఆరోగ్యం విషయంలో తాను వహించిన అశ్రద్ధను బయటపెట్టింది. ఇంతకు ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

    నాకు అదే శాపంగా మారింది

    నాకు అదే శాపంగా మారింది

    సినీ తారలను వేధించేది బరువు సమస్య. శారీరకపరమైన రుగ్మతలు మహిళ తారలకు ఓ శాపంలా మారుతుంటాయి. అందుకే ఆహారం విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. సినీ తారలకు 24 గంటలపాటు తిండిపెట్టే సేవకులు ఉన్న న్యూట్రిషన్లు మాత్రం ముట్టుకోనివ్వరు. సంపాదించిన సొమ్మంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే సరిపోతుంది అని రాధిక అన్నారు.

     విచ్చలవిడిగా బీర్లు తాగాను

    విచ్చలవిడిగా బీర్లు తాగాను

    గతంలో నేను విచ్చలవిడిగా బీర్లు, మద్యం సేవింాచను. కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆహారం భుజించాను. దాంతో నేను విపరీతంగా లావెక్కాను. అందుకు ప్రతిఫలం చెల్లించుకొన్నాను. చాలా సినిమాల్లో ఆఫర్లు ముఖం చాటేశారు. రోల్స్ ఇస్తామన్న వాళ్లు కూడా ఇవ్వకుండా నిరాకరించారు. దాంతో నేను చేసిన తప్పేంటో తెలుసుకొన్నాను అని రాధిక ఆప్టే పేర్కొన్నారు.

     విక్కీ డోనర్ అవకాశం చేజారిందలా

    విక్కీ డోనర్ అవకాశం చేజారిందలా

    2012లో నాకు విక్కీ డోనర్ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ సమయంలో నేను శరీరం, ఆరోగ్యంపై శ్రద్ద పెట్టలేదు. దాంతో నా ఫిగర్ దారుణంగా తయారైంది. దాంతో నన్ను ఆ సినిమా నుంచి తప్పించి యామీ గౌతమ్‌తో చేశారు. దాంతో నాకు హిట్ సినిమాలో నటించే అవకాశం చేజారింది. ఆ తర్వాత సినీ తారలకు శరీరం కాపాడుకోవడం ఎంత అవసరమో తెలిసి వచ్చింది అని రాధిక ఆప్టే వెల్లడించారు.

    జాగ్రత్తగా ఉండాలని సలహా

    జాగ్రత్తగా ఉండాలని సలహా

    అయితే వికీ డోనర్ అవకాశం చేజారిందనే విషయం బాధకలిగించినప్పటికీ.. నాకు ఆఫర్లు రాకుండా ఉండలేదు. దాని వల్ల నాపై ఎలాంటి చెబు ప్రభావం పడలేదు. సరైన సమయంలోనే నేను రియలైజ్ కావడం నాకు మంచి జరిగింది. కాబట్టి సినీ తారలు ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలని నేను సూచిస్తున్నాను అని రాధిక ఆప్టే పేర్కొన్నది.

    English summary
    Radhika revealed that she losted vicky donor offer. she was rejected after she had gone on a holiday for a month, drank a lot of beer, ate countless calories of food. She went out of control in terms of managing her weight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X