twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిగ్గొదిలేసి బహిరంగంగా.. ఇది చాలదా, ఇంకా కావాలా.. రాధికా ఆప్టే!

    |

    వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువు రాధికా ఆప్టే. ఇండస్ట్రీలో హీరోయిన్లకు వేధింపులు ఎదురవుతున్నాయంటూ రాధికా ఆప్టే గతంలో పలు సందర్భాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో రాధికా ఆప్టే అర్థ నగ్న చిత్రాలతో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిగురించి అడిగితే నా శరీరంపై నాకు హక్కు ఉందంటూ మాట్లాడుతుంది. ప్రస్తుతంబాలీవుడ్ లో మీటూ ఉద్యమం కొనసాగుతోంది. గతంలోనే మీటూ ఉద్యమానికి రాధికా మద్దత్తు ప్రకటించింది. తాజగా మరోమారు రాధికా తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడింది.

    Recommended Video

    Radhika Apte Stunning Photo Shoot Pictures Going Viral In Social Media | Filmibeat Telugu
     నూరుశాతం మద్దత్తు

    నూరుశాతం మద్దత్తు

    రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను మీటూ ఉద్యమానికి వందశాతం మద్దత్తు ఇస్తానని తెలిపింది. ఇలాంటి ఉద్యమాల వలన మహిళలకు కాస్త భరోసా ఉంటుందని తెలిపింది. హీరోయిన్లని, మహిళా ఆర్టిస్టులని వేధిస్తూ ఉంటే ఇక సహించేది లేదు అంటూ తేల్చి చెప్పేసింది. తనుశ్రీ దత్త ప్రారంభించిన మీటూ ఉద్యమానికి చాలా మంది సినీ ప్రముఖులు మద్దత్తు ప్రకటిస్తున్నారు.

    ట్విట్టర్ రివ్యూ: 'టాక్సీవాలా'గా విజయ్ దేవరకొండ.. సినిమా సూపరే, కానీ! ట్విట్టర్ రివ్యూ: 'టాక్సీవాలా'గా విజయ్ దేవరకొండ.. సినిమా సూపరే, కానీ!

    కేవలం పబ్లిసిటీ కోసమే

    కేవలం పబ్లిసిటీ కోసమే

    తనుశ్రీ దత్త మొదలు కొని, శృతి హరిహరన్, సంజన ఇలా ప్రముఖ నటీమణులంతా తమని వేధించిన సెలెబ్రిటీల పేర్లు బట్టబయలు చేశారు. దీనితో మీటూ ఉద్యమం పెను ప్రకంపనలు సృష్టించింది. ఆరోపణలు చేస్తున్న తనుశ్రీ దత్త లాంటి వారిపై విమర్శలు కూడా వినిపించాయి. ఎలాంటి అధరాలు లేకుండా ఆరోపణలు చేస్తూ పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి.

    సిగ్గొదిలేసి బహిరంగంగా

    సిగ్గొదిలేసి బహిరంగంగా

    అధరాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారనే వారికీ రాధికా ఆప్టే ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇలాంటి విషయాల్ని బయటకు చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. సిగ్గొదిలేసి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా తమకు జరిగిన వేధింపులని ప్రస్తావిస్తున్నారు. ఇది సరిపోదా.. ఇంకా ఆధారాలు కూడా చూపించాలా అంటూ రాధికా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

    నా వెంటపడ్డాడు

    నా వెంటపడ్డాడు

    ఓ సంద్భరంలో ఒక ప్రముఖుడు నా వెంట పడ్డాడు. అతడిని అక్కడే అడ్డుకుని బుద్ది చెప్పా. ఆ తరువాత నేను ఆ విషయాన్ని మరచిపోయా. కానీ అక్కడ ఉన్నవారంతా దీనిగురించి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు. ఓ షూటింగ్ లో భాగంగా ఈ ఘటన జరిగినట్లు రాధికా తెలిపింది. ఇలాంటి వ్యవస్థ మారాలని కోరింది.

    English summary
    Radhika apte latest comments on MeToo. She reveals sensational incident
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X