వర్షంలో అతడికి ముద్దు పెట్టాలనేది నా కల.. చీర కొంగు గాల్లోకి ఎగురుతూ రొమాన్స్.. రాధికా ఆప్టే!

హీరోయిన్ రాధికా ఆప్టే తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే లెజెండ్, లయన్, రక్త చరిత్ర లాంటి తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. బాలీవుడ్‌లో మీటూ ఉద్యమం మొదలు కాకముందే చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. పార్చ్డ్ లాంటి శృంగార చిత్రంలో నటించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. రాధికా ఆప్టేపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం రాధికా ఆప్టే డిజిటల్ మార్కెట్ రంగం నెట్ ఫ్లిక్స్‌లో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. తాజాగా రాధికా ఆప్టే తన చిన్ననాటి ఫాంటసీ గురించి వివరించగా ఆ వీడియో వైరల్ అవుతోంది.

 8 ఏళ్ల వయసులోనే

8 ఏళ్ల వయసులోనే

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఫాంటసీ ఉంటుంది. రొమాన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి. తనకు 8 ఏళ్ల వయసులోనే రొమాంటిక్ కల ఒకటి ఉండేదని అది ఇప్పటివరకు నెరవేరలేదని రాధికా ఆప్టే తెలిపింది. తన కలల రాకుమారుడుతో రాధికా ఆప్టే రొమాన్స్ ముచ్చట తీర్చుకోలేక పోయిండట. తన ఇంట్లో ఉండే పనిమనిషి వల్లే తనకు సినిమాలు చూడడం బాగా అలవాటైంది రాధికా చెబుతోంది.

వర్షంలో సాంగ్స్

వర్షంలో సాంగ్స్

పాత చిత్రాల్లో వర్షంలో సాంగ్స్ చాలా ఉండేవి. హీరోయిన్ చీరలో అందాలు ఒలకబోస్తూ డాన్స్ చేస్తుంది. హీరోయిన్ చీర కొంగు గాల్లోకి ఎగరడం, జుట్టు విరబోసుకుని డాన్స్ చేయడం నాకు చాలా బాగా అనిపించేది. హీరో వచ్చి హీరోయిన్ ని ముద్దు పెట్టుకునేవాడు. మా పనిమనిషికి సినిమాల పిచ్చి. ఎప్పుడూ సినిమాలు చూస్తూ ఉండేది. దీనితో నాకు కూడా సినిమాలు చూడడం అలవాటైంది. అలా చిన్నతనంలోనే రొమాంటిక్ సాంగ్స్ చూశానని రాధికా ఆప్టే తెలిపింది.

అతడిని ముద్దు పెట్టుకోవాలని

అతడిని ముద్దు పెట్టుకోవాలని

నేను చూసిన రైన్ సాంగ్స్ నాపై చాలా ప్రభావం చూపాయి. ఆ హీరోయిన్ల స్థానంలో నన్ను నేను ఊహించుకొనేదాన్ని. తనకు తెలిసిన ఓ అబ్బాయికి ముద్దు ఇస్తున్నట్లు కలగనేదాన్ని. అతడు నా కలలోకి వచ్చి ముద్దు ఇస్తాడని త్వరగా పడుకునేదాన్ని. తన ఫాంటసీ ఇంతవరకు నిజం కాలేదని రాధికా ఆప్టే చెబుతోంది.

బయిటకు చెప్పుకోవాలి

బయిటకు చెప్పుకోవాలి

మహిళలు తమ కలలని ధైరంగా బయిటకు చెప్పుకోవాలని, అందులో తప్పు లేదు అని రాధికా అంటోంది. రాధికా ఆప్టే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాధికా ఆప్టే ప్రస్తుతం ది ఆశ్రమ్, ది వెడ్డింగ్ గెస్ట్ అనే ఆంగ్ల చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తూ యువతని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ మీటూ ఉద్యమ సమయంలో రాధికా ఆప్టే తనుశ్రీ దత్తకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X