రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ.. కళ్ళు చెదిరేలా రాధికా ఆప్టే అందాలు!
Recommended Video

తరచుగా వివాదాల్లో చిక్కుకుని నిత్యం వార్తల్లో కనిపించే హీరోయిన్ రాధికా ఆప్టే. ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడేసి రాధికా.. అందాలు కూడా అదేస్థాయిలో ఆరబోస్తూ బోల్డ్ బ్యూటీగా గుర్తింపు పొందింది. చిరవరకు రాధికా ఆప్టే శృంగార ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో కూడా నటించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ తో బిజీగా గడుపుతోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఘాటు అందాల ఫోటో షూట్స్ తో కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది.

బ్లాక్ డ్రెస్‌లో తిరుగులేని అందం
ఇటీవల రాధికా ఆప్టే మాక్సిం మ్యాగజైన్ కు ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో రాధికా ధరించిన కాస్ట్యూమ్స్ అందాల ఆరబోత చూస్తే కుర్రాళ్లకు పిచ్చెక్కిపోవలసిందే. అందాలు ఆరబోయడం తనకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లుగా రాధికా ఘాటు ఫోజులతో చెలరేగిపోయింది.

తరచుగా వివాదాలు
రాధికా ఆప్టే తరచుగా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. ఆ మధ్యన టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఎక్కువ అంటూ రాధికా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో బాలయ్య సరసన లయన్ చిత్రంలో రాధికా చివరగా కనిపించింది. రక్తచరిత్ర, లెజెండ్ లాంటి విజయాలు ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి.

టెలివిజన్ సిరీస్
రాధికా ఆప్టే ప్రస్తుతం పలు టెలివిజన్ సిరీస్ లలో నటిస్తోంది. బాలీవుడ్ లో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో రాధికా బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఆ తరువాత శృంగార ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించడం లాంటి వివాదాలతో అమ్మడి ఇమేజ్ డ్యామేజ్ అయింది.

ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా
రాధికా ఆప్టే పలు ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవడ్ లో అరాకొరా అవకాశాలు దక్కుతున్నా కెరీర్ పుంజుకునే విజయం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం మాక్సిం మ్యాగజైన్ కు రాధికా చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











