బాలీవుడ్ బ్యూటితో డేటింగ్.. ఊహించని సమాధానం ఇచ్చిన ఆమ్ ఆద్మీ లీడర్!
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణితి చోప్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉంది అని అనేక రకాల కథనాలు అయితే విలువడ్డాయి. మొదట ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది అని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఆ వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అని తెలియడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారిపోయింది.
అతను మరెవరో కాదు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అని తెలుస్తోంది. రీసెంట్ గా ముంబైలోనే ఒక రెస్టారెంట్ లో రాఘవ్, పరిణితి ఓకే చోట కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాళ్లు ఆ వీడియో పై ఒక క్లారిటీ కూడా ఇవ్వకముందే బాలీవుడ్ మీడియా ఊహించని విధంగా కథనాలను అల్లేసింది.

రాఘవతో పరిణితి ప్రేమలో ఉంది అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా పలు రకాల కథనాలు వెలుపడ్డాయి. అయితే ఈ విషయంలో ఇంకా వారిద్దరి నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇటీవల రాఘవ్ ను ప్రత్యేకంగా బాలీవుడ్ మీడియా కొన్ని ప్రశ్నలు వేసింది. ఆయన కారులోకి ఎక్కేందుకు వెళుతూ ఉండగా మీడియా సభ్యులు అడ్డుపడి పరిమితి చోప్రాకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యిందని ఆ ఆ విషయంపై మీరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు అని అడగడంతో ఆయన నవ్వుతూ ఆ విషయాన్ని దాటవేసి ప్రయత్నం చేశారు.
ఏవైనా ప్రశ్నలు ఉంటే రాజనీతి గురించి అడగండి అంటూ.. పరిణితి గురించి కాదు అని ఆయన నవ్వుతూ మరొక సమాధానం కూడా ఇచ్చారు. ఇక ఎంత అడిగినా కూడా నవ్వుతూ నమస్కారం పెట్టి అక్కడి నుంచి జారుకున్నారు. అయితే పరిణితి చోప్రాతో రాఘవ్ ప్రేమలో ఉన్నారా లేదా అనే విషయంలో ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మరొకవైపు పరిణీతి కూడా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బహుశా వీరిద్దరూ డేటింగ్ లో ఉండవచ్చు అని కూడా బాలీవుడ్ మీడియాలో అనేక రకాల వార్తలు షికారు చేస్తున్నాయి. మరి ఈ విషయంలో ఈ సెలబ్రిటీలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











