రాఘవ లారెన్స్ చేతికి మళ్లీ లక్ష్మీబాంబ్.. గొడవలు సద్దుమణిగి అక్షయ్‌తో
కాంచన చిత్రాన్ని రీమేక్ లక్ష్మీబాంబ్‌తో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ రాఘవ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అయితే సినిమా ఫస్ట్‌లుక్ అంశం లారెన్స్‌కు మనస్తాపం కలిగించడం వివాదంగా మారింది. తనను సంప్రదించకుండా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారని ఆయన సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అయితే లారెన్స్‌తో హీరో అక్షయ్ కుమార్ జరిపిన సంప్రదింపులు ఫలప్రదం కావడంతో మళ్లీ లారెన్స్ దర్శకత్వ బాధ్యతల స్వీకరించారు. శనివారం నుంచి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లారెన్స్ ట్వీట్ చేశారు. లక్ష్మీబాంబ్ సినిమా డైరెక్టర్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టాను. నిర్మాత షాబినా ఖాన్‌కు థ్యాంక్స్. నాకు ఆమె ఇచ్చిన గౌరవం మరువలేనిది. అక్షయ్ కుమార్ సర్‌తో భాగం కావడం హ్యాపీగా ఉంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా అక్షయ్ కుమార్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

మే 18న తేదీన లక్ష్మీబాంబ్ సినిమా నుంచి తప్పుకొంటున్నట్టు లారెన్స్ రాఘవ ప్రకటించారు. దర్శకుడిగా గౌరవం ఇవ్వకుండా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. తాను సినిమా నుంచి తప్పుకొంటున్నాను. అక్షయ్ కుమార్ సర్‌పై గౌరవంతో స్క్రిప్టు అన్నీ వారికే ఇచ్చాను అని అన్నారు. తాజాగా సంప్రదింపులతో ఆ సమస్య పరిష్కారం అయింది.
ఇప్పటికే లక్ష్మీబాంబ్ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్ ముంబైలో పూర్తయింది. సెప్టెంబర్ నుంచి సుదీర్ఘమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. లారెన్స్ రాఘవ మళ్లీ వెనక్కి రావడంతో సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నది.


Click it and Unblock the Notifications











