ఆ హీరో గొడవల్లేవు.. అందుకే గుడ్‌బై చెప్పా.. లక్ష్మీబాంబ్ వివాదంపై లారెన్స్ రాఘవ క్లారిటీ

తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన కాంచన సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ లారెన్స్ రాఘవ లక్ష్మీబాంబ్ రూపొందిస్తున్నట్టు వచ్చిన వార్త బాలీవుడ్ మీడియాలో క్రేజీగా మారింది. ఈ సినిమాలోని అక్షయ్ కుమార్ తన గెటప్‌కు సంబంధించిన లుక్‌ను షేర్ చేయడంతో మరింత హైప్‌ను పెంచింది. ఫస్ట్ లుక్ వెల్లడి వివాదంగా మారి సినిమా షూటింగ్‌కు బ్రేక్ వేసింది. తాను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం షాక్ గురిచేసింది.

నిర్మాతలు తుషార్ కపూర్, షాబినా ఖాన్‌తో నాకు క్రియేటివ్ విభేదాలు తలెత్తాయి. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకొన్నాను. నాకు తెలియకుండా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అది నాకు నచ్చలేదు. డైరెక్టర్‌గా నాతో చర్చించకుండా ఎలా ఫస్ట్ లుక్ షేర్ చేస్తారు అని లారెన్స్ మీడియాతో అన్నారు. చివరకు ఎలాంటి సమాచారం, వివరణ ఇవ్వకపోవడంతో మనస్తపానికి గురయ్యాను అని అన్నారు.

Raghava Lawrence on Laxmmi Bomb Contraversy: No Issues with Akshay Kumar

నాకు హీరో అక్షయ్ కుమార్‌తో ఎలాంటి సమస్యలు లేవు. నాకు నిర్మాతలతో గొడవలు ఏర్పడినా.. నా సినిమా స్క్రిప్టు ఇవ్వడానికి కారణం కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే. ఆయన అంటే నాకు గౌరవం. అందుకే స్క్రిప్టును ఇచ్చేశాను అని లారెన్స్ రాఘవ అన్నారు.

ప్రొడక్షన్ హౌస్‌తో లక్ష్మీబాంబ్ సినిమా వివాదాన్ని పరిష్కరించేందుకు నా లాయర్లు పరిష్కరిస్తున్నారు. నాకు అక్షయ్ ఎలాంటి సమస్యలు లేవని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఈ సినిమాలోని పాత్రను చాలా సీరియస్‌గా తీసుకొని చేస్తున్నాడు. అందుకే ఆయనకు స్క్రిప్టు అందించాను అని అన్నారు.

Raghava Lawrence on Laxmmi Bomb Contraversy: No Issues with Akshay Kumar

లక్ష్మీ బాంబ్ చిత్రంలో ట్రాన్స్‌జెండర్‌గా బిగ్‌బీ అమితాబ్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ, తెలుగు వెర్షన్లలో ఈ పాత్రను శరత్ కుమార్ పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమితాబ్‌తో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా అమితాబ్ రోల్ గురించి వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

లక్ష్మీబాంబ్ చిత్రాన్ని బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్, షాబీనా ఖాన్ నిర్మిస్తున్నారు. హౌస్‌ఫుల్ 4 డైరెక్టర్ పర్హాద్ సమ్జి హిందీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. ఇంకా ఈ చిత్రంలో ఆర్ మాధవన్, శోభితా ధూళిపాళ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X