కుర్ర హీరోయిన్‌తో ముసలి విలన్ డేటింగ్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
ప్రేమకు కులం, మతం, ప్రాంతం, భాషా లాంటివి అడ్డుకావని నిరూపించాడు వెండితెర విలన్ రాహుల్ దేవ్. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తన మార్కును ఎస్టాబ్లిష్ చేసుకొన్న రాహుల్ లేటు వయసులో కుర్ర హీరోయిన్‌తో ఘాటైన ప్రేమాయణం సాగిస్తున్నాడు. తాజాగా తన ప్రేయసితో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇంతకు ఆయన డేటింగ్ చేస్తున్నది ఏ హీరోయిన్‌తో అంటే..

పలు భాషల్లో బిజీగా రాహుల్ దేవ్
సినీ పరిశ్రమలో రాహుల్ దేవ్ ప్రతిభావంతుడైన నటుడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హిందీ, తెలుగు, తమిళంలో బిజీగా ఉన్న ఈ విలన్.. ఈ ఏడాది మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరాఠీలో రాకీ, గుజరాత్‌లో పాగల్ పంతీ, బెంగాల్‌లో బికాబ్ చిత్రాల ద్వారా ఆయా భాషల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ముగ్దా గాడ్సేతో రొమాంటిక్‌గా
ఇక కెరీర్‌ను నాన్‌స్టాప్‌గా కొనసాగిస్తూనే తన ప్రియురాలు ముగ్ధా గాడ్సేతో డేటింగ్ వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. వారిద్దరి మధ్య సుదీర్ఘంగా ప్రేమాయణం కొనసాగుతున్నది. వారిద్దరి ప్రేమాయణం, వారి రొమాంటిక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చర్చనీయాంశమైంది.

వారిద్దరి మధ్య వయసు తేడా
ఇక ముగ్దా విషయానికి వస్తే ఆమెకు 33 ఏళ్లు.. రాహుల్ దేవ్‌కు 51 ఏళ్లు. వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం 18 సంవత్సరాలు. అయితే వయసు వ్యత్యాసాన్ని పట్టించుకోకుండా రాహుల్, ముగ్దా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. తమపై మీడియాలో వస్తున్న కథనాలను తమకేమీ పట్టదనే రీతిలో వ్యవహరిస్తున్నారు.

ఏజ్ గ్యాప్ ఉంటే సమస్యేంటి?
రాహుల్ దేవ్‌తో ఏజ్ గ్యాప్ గురించి ముగ్దా గాడ్సే స్పందిస్తూ.. వయసు వ్యత్యాసం పట్టించుకోవాల్సిందే. కానీ మా పేరెంట్స్ మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉంది. అదేమీ వారికి ఇబ్బంది కాలేదు. వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం పడనప్పుడు.. మేమెందుకు పట్టించుకొవాలి. మా మధ్య ప్రేమ బలంగా ఉన్నప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించాలి అని ముగ్దా అన్నారు.
Recommended Video


ముగ్దా గాడ్సే కెరీర్
ముగ్దా గాడ్సే కెరీర్ విషయానికి వస్తే.. ఫ్యాషన్ చిత్రంలో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తమిళంలో థని ఓరువన్ చిత్రంలో అరవింద్ స్వామికి భార్యగా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ఫౌజీ కాలింగ్‌లో శర్మాన్ జోషితో కలిసి నటిస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











