యంగ్ హీరోయిన్‌తో రాహుల్ దేవ్ డేటింగ్.. 14 ఏళ్ల గ్యాప్ ఉంటే ఏంటీ అంటూ ఫైర్
బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్, యువ తార ముగ్ధ గాడ్సే ప్రేమయాణం హిందీ మీడియాలో వైరల్గా మారింది. 51 ఏళ్ల రాహుల్.. 33 ఏళ్ల ముగ్దతో ప్రేమలో పడటంపై మీడియాలో కథనాలు దండిగా వస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్ దేవ్ స్పందిస్తూ ఏజ్ గ్యాప్‌పై స్పందించారు. 2013 నుంచి ముగ్ధతో రాహుల్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రాహుల్ దేవ్‌కు రినా అనే యువతితో 11 ఏళ్లపాటు దాంపత్య జీవితాన్ని అనుభవించారు. మొదటి భార్యతో సిద్ధార్థ్ అనే కుమారుడు కూడా ఉన్నారు. అయితే 2009లో రీనా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి రాహుల్, ముగ్ధ డేటింగ్ చేస్తున్నారు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. నాకు ముగ్దాకు 14 సంవత్సరాల గ్యాప్ ఉంది. అదీ మాకు ఎలాంటి సమస్యను తెచ్చి పెట్టడం లేదు. అందువల్ల మా మధ్య లేని ఇబ్బంది మిగితా వారికి ఎందుకనే ఎదురు ప్రశ్న వేశారు రాహుల్.
మాది తొలిచూపులోనే పడిన ప్రేమ కాదు. కామన్ ఫ్రెండ్ ద్వారా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత పలు ఫంక్షన్లలో కలుసుకొన్న తర్వాత ఒకరిపై మరొకరికి ఇష్టం కలిగి కలిసి జీవిస్తున్నాం. మా మధ్య విడదీయలేనంత ప్రేమ ఉంది అని రాహుల్ దేవ్ అన్నారు.


Click it and Unblock the Notifications











