మోడీ కంటే ఫాస్ట్‌గా ఉన్నాడే.. రాహుల్ గాంధీ బయోపిక్ టీజర్ వచ్చేసింది!
ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీకి ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మోడీ బయోపిక్‌కు పోటీగా ఇపుడు రాహుల్ గాంధీ బయోపిక్ కూడా రాబోతోంది. చిత్రం బృందం ఏకంగా టీజర్ కూడా విడుదల చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.
'మై నేమ్ ఈజ్ రాగా' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రూపేష్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. రాగా అంటే రాహుల్ గాంధీ అని అర్థం. తాజాగా విడుదలైన 3 నిమిషాల నిడివిగల టీజర్లో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని పాత్రలు సైతం చూపించారు.
రాహుల్ గాంధీ చిన్నతనం నుంచి రాజకీయాల్లోకి వచ్చే వరకు ఆయన జీవితం ఎలా సాగింది? అనేది ఈ,చిత్రంలో చూపించబోతున్నారు. ఇందులో ఇందిరా గాంధీ హత్యోదంతం కూడా ఉండటం గమనార్హం. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ, అమిత్ షా పాత్రలు కూడా 'మై నేమ్ ఈజ్ రాగా' టీజర్లో కనిపించాయి.

టీజర్ చూస్తుంటే త్వరలో రాబోయే సార్వత్రికల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టం అవుతోంది. ఎన్నికల ముందే దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ... ఇద్దరి జీవితాలపై బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. ఈ పొలిటికల్ బయోపిక్ చిత్రాలు ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











