లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్ భార్య కన్నుమూత
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ తల్లి కృష్ణ రాజ్ కపూర్ సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా శ్వాస సంబంధమైన సమస్యతో బాధ పడుతున్న తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు.
రాజ్ కపూర్, కృష్ణ కపూర్ వివాహం మే, 1946లో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. కుమారులు రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్‌తో పాటు కూతుళ్లు రితూ నందా, రిమి జైన్ ఉన్నారు.

తల్లి మరణంపై రణధీర్ కపూర్ ట్విట్టర్లో స్పందిస్తూ... 'మా తల్లి చనిపోయిందనే విషయం చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. ఈ రోజు ఉదయం ఆమె ప్రశాంతంగా కన్నుమూశారు' అని తెలిపారు.
సోమవారం ఉదయం 5 గంటలకు గుండెపోటుతో తన తల్లి మరణించినట్లు రణధీర్ కపూర్ తెలిపారు. ఆమె మరణంతో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిందని మీడియాకు వెల్లడించారు. కృష్ణా కపూర్ అంత్యక్రియలు చెంబూరు శ్మషానవాటికలో నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











