Raj Kundra Arrest: శిల్పాశెట్టి భర్తకు అంత సంపాదన ఎలా అంటే.. వైరల్‌గా వీడియో

అడల్ట్ కంటెంట్ షూట్, మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ వ్యవహారంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో హిందీ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోర్నోగ్రాఫిక్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసి యాప్‌ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెలుగు చేశాయి. ఈ వ్యవహారంలో మోడల్, హీరోయిన్ గెహనా వశిష్ట్‌తోపాటు తొమ్మిది మందిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

అడల్డ్ కంటెంట్ ఆధారిత షార్ట్‌ఫిలిం, వెబ్ సిరీస్ లాంటి చిత్రాల్లో నటిస్తున్న మరికొందరు తారలపై పోలీసులు దృష్టిపెట్టారు. అడల్డ్ కంటెంట్ వ్యవహారంలో యూకేకు సంబంధించిన కెన్రీన్ అనే కంపెనీకి లింకులు ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. కెన్నీన్ కంపెనీలో రాజ్ కుంద్రా గతంలో పార్ట్‌నర్‌గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Raj Kundra Arrest: Kapil Sharmas Chat with Shilpa Shetty, Shamita Shetty goes viral

సోషల్ మీడియా యాప్‌లో గెహ్నా వశిష్ట్‌తో షూట్ చేసిన ఎనిమిది వీడియోలు అప్‌లోడ్ చేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో టాప్ కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్‌లో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి, షమితా శెట్టి పాల్గొన్న ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో హోస్ట్ కపిల్ శర్మ లేవనెత్తిన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ షోలో రాజ్ కుంద్రాతో కపిల్ శర్మ మాట్లాడుతూ.. మీరు సినీ తారలతో ఫుట్ బాల్ అడుతుంటూ కనిపిస్తారు. లేదా ఫ్లయిట్స్ జర్నీ చేస్తూ కనిపిస్తారు. శిల్పాశెట్టితో షాపింగ్ చేస్తూ కనిపిస్తావు.. ఇంకేదో చేస్తూ బిజీగా ఉంటారు. ఇలా ఏమీ పని చేయకుండా మీరు డబ్బు ఎలా సంపాదిస్తారు అని అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. అయితే తన భర్త రాజ్ కుంద్రా చాలా కష్టపడుతాడు. పని చేస్తూ సమయాన్ని కూడా మరిచిపోతుంటాడు అని శిల్పాశెట్టి తెలిపారు.

అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో రాజ్ కుంద్రాపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మీరు చేసే పని ఇదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాజ్ కుంద్రాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X