twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Raj Kundra Arrest: పోర్న్ మాఫియాతో టాప్ హీరోయిన్లు, నిర్మాతకు లింకులు.. ఒక్కో ప్రాజెక్టుకు 30 లక్షలు అంటూ

    |

    అశ్లీల, అసభ్యమైన వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. రాజ్‌కుంద్రా అరెస్ట్ తర్వాత అనూహ్యంగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొబైల్ యాప్‌ ద్వారా పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాతోపాటు 11 మందిని అరెస్ట్ చేయడం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ కేసు విచారణలోకి వెళితే..

    అమలాపాల్ ఘాటైన క్లివేజ్ షో .. బోల్డ్ లుక్‌తో హాట్ హాట్‌గాఅమలాపాల్ ఘాటైన క్లివేజ్ షో .. బోల్డ్ లుక్‌తో హాట్ హాట్‌గా

    రాజ్ కుంద్రాపై ఆరోపణలు, అరెస్ట్

    రాజ్ కుంద్రాపై ఆరోపణలు, అరెస్ట్

    మొబైల్ యాప్‌లో పోర్నోగ్రాఫిక్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్నారనే ఫిర్యాదు జూన్‌లోనే నమోదైంది. అయితే తనపై అరోపణలు రావడంతో రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకొన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన ఖండించారు. వెబ్ సిరీస్, వీడియోలను ప్రొడ్యూస్ చేసే స్టార్టప్ కంపెనీ నుంచి బయటకు వచ్చాను అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయనకు పోర్నోగ్రఫి మాఫియాతో లింకులు ఉన్నాయని నిర్ధారించుకొన్న తర్వాత ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

    ఏక్తా కపూర్‌కు లింకులు?

    ఏక్తా కపూర్‌కు లింకులు?


    ఇదిలా ఉండగా, మార్చ్ 26వ తేదీన బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. ఈఆ కేసులో షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండేను కూడా విచారించారు. షెర్లీన్, పూనమ్ పాండేలకు రెమ్యునరేషన్ ఇచ్చి వారితో అడల్ట్ కంటెంట్ షూట్ చేశారు. షెర్లీన్‌కు ప్రతీ ప్రాజెక్టుకు 30 లక్షలు ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 20 ప్రాజెక్టులను షెర్లీన్ పూర్తి చేసింది అని ముంబై సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది.

    రాజ్ కుంద్రా ప్రధాన కుట్రదారుడు అంటూ

    రాజ్ కుంద్రా ప్రధాన కుట్రదారుడు అంటూ


    రాజ్ కుంద్రా అరెస్ట్‌ను ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే ధృవీకరించారు. జూలై 19వ తేదీన ఆయనను అరెస్ట్ చేశాం. పోర్నోగ్రాఫిక్ కంటెంట్ విషయంలో ప్రధాన కుట్రదారుడిగా పరిగణనిస్తున్నాం. విచారణ కొనసాగుతున్నది. ఈ కేసులో మాకు పూర్తిస్థాయిలో సాక్ష్యాలు ఉన్నాయి అంటూ హేమంత్ చెప్పారు.

    రాజ్ కుంద్రాపై పెట్టిన కేసులు ఇవే

    రాజ్ కుంద్రాపై పెట్టిన కేసులు ఇవే


    అశ్లీల కంటెంట్ షూట్ చేసి మొబైల్ యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అరోపణలపై కేసు నమోదు చేశాం. ఆయనపై ఐటీ యాక్ట్, ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ (ప్రొబేషన్) చట్టాల కింద ఐపీసీ 292, 67, 67ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరినీ విచారిస్తున్నాం. ఈ కేసులో లోతైనా దర్యాప్తు చేస్తున్నాం అని కమిషనర్ హేమంత్ చెప్పారు.

    Recommended Video

    The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
    మరోసారి బాలీవుడ్‌లో అలజడి

    మరోసారి బాలీవుడ్‌లో అలజడి


    అశ్లీల, అసభ్య వీడియోల వ్యవహారం బయటకు పొక్కడంతో మరోసారి బాలీవుడ్ ప్రతిష్ట మసక బారిందనే విషయం చర్చకు వచ్చింది. ఇప్పటికే డ్రగ్స్ మాఫియాతో సినీ తారల లింకులు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఘటనలు హిందీ సినిమా రంగంలో అత్యంత వివాదాస్పద అంశాలుగా మారిన సంగతి తెలిసిందే. వాటిని నుంచి బయట పడకముందే రాజ్ కుంద్రా అరెస్ట్ మరోసారి సంచలనం రేపింది.

    English summary
    Raj Kundra arrested by Maharasthra Cyber Cell in pornographic content creation case in Mumbai. Apart from his arrest, Sherlyn Chopra, Poonam Pandey and Ekta Kapoor names surfaced but, NO arrest were made in this case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X