Raj Kundra కు మరింత బిగుస్తున్న ఉచ్చు.. శిల్పాశెట్టికి కష్టకాలం దాపురింపు!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాకు సంబంధం ఉన్న పోర్న్ రాకెట్ కేసులో జూలై 26వ తేదీన పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ కేసులో శృంగార చోప్రాకు సమన్లు జారీ చేయడం, అలాగే రాజ్ కుంద్రాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం లాంటి అంశాలు ఈ కేసుపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ కేసులో సోమవారం జరిగిన కీలక విషయాలు ఏమిటంటే..

Recommended Video

Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu

 కాన్పూర్‌లో అకౌంట్లు సీజ్

కాన్పూర్‌లో అకౌంట్లు సీజ్

పోర్న్ రాకెట్ కేసులో దర్యాప్తు చేస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాపై కొరడా ఝుళిపించారు. ఆయనకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లను సీజ్ చేశారు. ఈ విసయాన్ని కాన్పూర్‌కు చెందిన బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు.

కుంద్రా బెయిల్‌పై విచారణ

కుంద్రా బెయిల్‌పై విచారణ

జూన్ 27వ తేదీన రాజ్ కుంద్రా బెయిల్ విచారణ జరుగనున్నది. ఈ కేసులో రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటషన్‌ను బాంబే హైకోర్టు విచారించనున్నది. ఈ విషయాన్ని రాజ్ కుంద్రా లాయర్ వెల్లడించారు. రాజ్ కుంద్రాకు బెయిల్ ఇచ్చే విషయం బాంబే హైకోర్టు విచారిస్తుంది. బెయిల్ లభిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

25 బ్లూ ఫిలింస్ తీశానని..

25 బ్లూ ఫిలింస్ తీశానని..


రాజ్ కుంద్రా పోర్నోగ్రఫి కేసులో దర్శకుడు తన్వీర్ హష్మీని విచారించారు. పోలీసుల విచారణలో తాను న్యూడ్ ఫిలింస్ రూపొందించానని అంగీకరించారు. దాదాపు 25 బ్లూఫిలింస్ చిత్రాలను నిర్మించాం. వాటిని సాఫ్ట్ పోర్న్ అని తన్వీర్ హష్మీ పేర్కొన్నారు.

శిల్పాశెట్టి ఫోన్ క్లోనింగ్

శిల్పాశెట్టి ఫోన్ క్లోనింగ్

పోర్న్ రాకెట్ కేసు శిల్పాశెట్టి మెడకు చుట్టుకొంటున్నట్టు కనిపిస్తున్నది. ఈ వ్యవహారంలో ఆమె పాత్రను ధృవీకరించేందుకు ఫోన్‌ను క్లోనింగ్ చేయాలని నిర్ణయించారు. ఫోన్ సీజ్ చేసి అందులోని విషయాలను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో శిల్పాశెట్టి పాత్ర ఉందని అధికారులు బలంగా నమ్ముతున్నారు.

 మరోసారి శిల్పాశెట్టిని విచారించే..

మరోసారి శిల్పాశెట్టిని విచారించే..


ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శిల్పాశెట్టిని మరోసారి క్రైమ్ బ్రాంచ్ అధికారులు విచారించనున్నారు. దాంతో ఆమె అరెస్ట్ తప్పదనే ఊహాగానాలు ముంబై మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. రోజు రోజుకు రాజ్ కుంద్రా వ్యవహారం అనేక పరిణామాలకు చోటిస్తుండటంతో ఇంకా పలువురు ఈ కేసులో ఇరికిపోయే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తున్నది.

 షెర్లీన్ చోప్రాకు సమన్లు

షెర్లీన్ చోప్రాకు సమన్లు


ఇదిలా ఉండగా, షెర్లీన్ చోప్రాకు ఈ కేసులో క్రైంబ్రాంచ్ ప్రాపర్టీ సెల్ అధికారులు సమన్లు జారీ చేశారు. జూలై 27వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. మంగళవారం 11 గంటలకు ఆమెను విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో షెర్లీన్ చోప్రా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X