twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముంబై పోలీసులకు షాకిచ్చిన రాజ్ కుంద్రా.. బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు

    |

    పోర్న్ రాకెట్ కేసులో దర్యాప్తు జరుపుతున్న మహారాష్ట్ర సైబర్ సెల్ విభాగానికి రాజ్ కుంద్రా షాకిచ్చారు. ఈ కేసులో జూలై 19వ తేదీన ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ రిమాండ్‌లో విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడించడం లేదు. చాలా విషయాలపై పెదవి విప్పి సమాధానాలు ఇవ్వడం లేదు. కాబట్టి మరి కొన్ని రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించాలని చేసిన వినతికి కోర్టు సానుకూలంగా స్పందించి జూలై 27వ వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.

    అయితే తన అరెస్ట్ అక్రమం, చట్టరీత్యా వ్యతిరేకం అంటూ కుంద్రా తన లాయర్‌తో పిటిషన్ దాఖలు చేయడం ఈ కేసు విచారణ మరింత ఆసక్తిగా మారింది. ఈ మేరకు కుంద్రా పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారిస్తున్నది.

     Raj Kundra call his arrest Illegal, files petition in Bombay High Court

    ఇదిలా ఉండగా, కుంద్రాను పోలీస్ రిమాండ్‌లోకి తీసుకొన్న పోలీసులు నేరుగా జుహులోని ఆయన ఇంటికి వెళ్లారు. కుంద్రా ఇంటిలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. పోర్నోగ్రాఫిక్ కంటెంట్ క్రియేషన్ విషయంలో ఆయన ఆర్థిక లావాదేవీలు ఏ మేరకు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా శిల్పాశెట్టి నివాసంపై మరోసారి దాడులు నిర్వహించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    ప్రస్తుతం కుంద్రాకు సంబంధించిన జేఎల్ స్ట్రీమ్ అనే కంపెనీ లావాదేవీలపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దృష్టిపెట్టారు.

    English summary
    Raj Kundra files petition in Bombay High Court about his arrest. He moves Bombay High Court against his arrest and calls the arrest 'illegal'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X